సప్త చిరంజీవులు.
చిరంజీవులు అంటే చిరకాలం జీవించిఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు.
పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం.
అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||
దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ; బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు.
1)అశ్వద్దామ:- ద్రోణాచార్యుని కుమారుడు,మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు. ఇతడు చిరంజీవి.
2)బలి:- ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు,ఇంద్రుని జయించినవాడు,వామనమూర్తి కి మూడడుగుల భూమిని దానం చేసి,అతని చే పాతాళమునకు తొక్కబడిన వాడు . కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గధాధారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు .ఇతడు చిరంజీవి. ఇతని సత్య సంధతకు మెచ్చిన మహా విష్టువు ఈమన్వన్తరములో దైత్త్యేద్రత్వమును , పై మన్వంతరములో దేవేంద్ర పదవిని అనుగ్రహించాడు .
3)వ్యాసుడు :- సత్యవతీ పరాసరుల కుమారుడు.కృష్ణ ద్వయపాయనముని అని పిలవబదేవాడు. అష్టదశాపురాణాలను, బ్రహ్మసూత్రములను,భారత భాగవతములను ఇంకనూ అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వానిని వ్యాసుడు అని పేర్కొంటారు. ఒక్కొక్క యుగములో ప్రశంసింప బడినారు .
4)హనుమంతుడు:- కేసరి భార్య అగు అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో వున్నా శివుని శక్తిని ఆమెకు ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టినాడు .సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు .పరమేశ్వరుని అవతారముగా కొలవబదినవాడు హనుమంతుడు .రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ .మహా భారతయుడంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయమునకు కూడా దోహదకారి అయినాడు .ఇతడు చిరంజీవుడు .రామ భాక్తాగ్రేస్వరుడైన ఆంజనేయుడు చిరంజీవిగా తన భక్తులకు సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉంటాడు.
5) విభీషణుడు:- కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు . బ్రహ్మపరమున ఈతడు సుశీలుడైనాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ .రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి ,సన్మార్గము గూర్చి చెప్పేవాడు .సముద్రమును దాటుటకు శ్రీ రామునకు ఉపాయము చెప్పినవాడు .రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పినవాడు.రావణుని అనంతరం లంకాధిపతి అయినాడు.ఇతడు చిరంజీవుడు.
6)కృపుడు:- శరద్వంతుని కుమారుడు .శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు ,ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపినాడు .ఆమెను చూడగానే యితడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి మరియొక చోటుకు వెళ్ళినాడు ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు . కృపునితో పాటుగా సరద్వాన్తునికి మరియొక ఆడపిల్ల కల్గినది .ఆపిల్లలను వదిలి తపస్సుకి మరిఒక చోటికి వెళ్ళినాడు .అటువంటి సమయమున వేటకు వచ్చిన శంతనుడు .ఈ పసికందులను చూచి కృపతో పెంచినాడు .అందులకే వీనికి క్రుపయని క్రుపుదని పేర్లు వచ్చినవి.శరద్వంతుడు కృపునకు ఉపనయాదికములను చేసి ధనుర్వేదమును నేర్పినాడు .భీష్ముని కోర్కె మన్నించి ధర్మజాడులకు ధనుర్విద్యను నేర్పినాడు .భారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమును నిలిచి యుద్ధం చేసినాడు . యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు. దృతరాష్ట్రుడుతో కూడి తపోవనమునకు వెళ్ళినాడు రాబోవు సుర్యసవర్నిక మన్వంతరములో సప్తరుషులలో కృపునకు ఒక స్థానము పొందు వాడుగా వున్నాడు .ఇతడు చిరంజీవుడు.
7)పరశు రాముడు:- ఇతడు రేణుకా జమదగ్నుల కుమారుడు .తండ్రి ఆజ్ఞను మన్నించి తల్లిని కూడా సంహరించినాడు.ఇతనిని మెచ్చుకొన్న తండ్రి వరం కోరుకొమ్మనగా తల్లిని బ్రతికించమన్నాడు .తన సోదరులకు తండ్రివలన శాపమును తొలగింప చేసాడు జమదగ్నికి తాత బృగు మహర్షి ,ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయమునకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసినాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వొచ్చి పరశురాముని పరీక్షించినాడు .శివుని ఉత్తర్వుతో తీర్ధ యాత్రలు చేసినాడు ,శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందినాడు
నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా వందేళ్ళు జీవిస్తారు. ఎనిమిదో వానిగా మార్కండేయున్ని స్మరించడం ద్వారా మృత్యు భయం వీడిపోతుంది.
Comments
Post a Comment