చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం తేది 30-12-2016 నుండి . “ పుష్య ” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది.వైకుంట ఏకాదశి ఈ నెలలోనే వచ్చింది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్ప బడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి , ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు. ఈ మాసం లో గృహ ప్రవేశాలు , పెళ్ళిళ్ళు , శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు , పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది....
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com