యువతీ యువకుల వివాహం వారణ మాయురం మహిమ గోదా దేవి తన ‘ వారణ మాయిరం ’(9.6) లో భగవంతున్ని వివాహమాడినటుల కల కన్నది. పెరియాళ్వార్ , ఆండాళ్ కు అర్చావతార వైభవమును తెలుపగా ఆండాళ్ ‘ తిరువరంగత్తాన్ ’ ( శ్రీరంగనాథున్ని) ఇష్ఠపడినది.ఆండాళ్ కోరికను ఎలా తీర్చాలి అని పెరియాళ్వార్ ఆందోలనతో చింతించసాగిరి. ఒకనాడు కలలో శ్రీరంగనాథుడు కనిపించి ఆండాళ్ ను శ్రీరంగమునకు తీసుకరావల్సినది అక్కడ కలుద్దామన్నాడు. ఆ మర్నాడు శ్రీరంగనాథుడు తన పరిచారకులను , అర్చకులను , ఛత్రములను , చామరములను , అందమయిన పల్లకిని , ఆండాళ్ ను కొనిపోవుటకు శ్రీవిల్లిపుత్తూరునకు పంపగా పెరియాళ్వార్ చాలా ఆనందపడెను. పెరియాళ్వార్ శ్రీవిల్లిపుత్తూరు వటపత్రశాయి దగ్గర ఆనతి తీసుకొని పల్లకిలో ఆండాళ్ ను కూర్చుండపెట్టి మేళతాళములతో పెద్ద ఊరేగింపుగా శ్రీరంగమునకు బయలుదేరెను. గోదా దేవి కల్యాణం రోజున ఇప్పటికి కూడా దేవాలయములో అర్చకులు పసుపులో ముంచిన కొబ్బారికాయలతో ఆడుతూ ఈ వారణ మాయిరం చదువుతారు. ఈ కొబ్బరికాయలు పెండ్లి కావలసిన యువతీ యువకులు ప్రసాదముగా స్వీకరించినట్లయితే వారికి తప్పకుండ వివాహము జరుగును .