Skip to main content

Posts

Showing posts from September, 2017
షష్టి పూర్తి ''జన్మబ్దే , జన్మమాసేచ , స్వజన్మదివసే తథా, జన్మర్శేచైవ కర్తవ్యా శాంతి ఉగ్రరధాహ్వాయా; దేవాలయే నదీతీరే స్వగృహే; వా; శుభస్థలే''   ఈ శాంతి లకి ఉగ్రరధ హోమము, ఉగ్రరధ శాంతి అని పేరు. ఋషీశ్వరులు, మునులు, శాస్త్రము చెప్పినదాన్ని బట్టి ఒక మనిషి జీవితం లో 60 సం " పూర్తి కావటం అంటే ఆ మనిషి తిరిగి పుట్టటం లాంటిది అని, పుట్టినప్పుడు చేసిన జాతకకర్మలన్నీ తిరిగి మళ్లీ జరిపించాలని అంటారు. మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్క. షష్టి పూర్తి అనగా తల్లితండ్రులకు అరువది సంవత్సరములు పూర్తి అయిన పిదప మరల అరువది సంవత్సరముల ఆయువును ప్రసాదించమని భగవంతును కోరుచూ చేయు ఉత్సవము. దీనినే షష్టి పూర్తి మహోత్సవం అని అంటారు. ఈ షష్టి పూర్తి మహోత్సవం నే అమృతోత్సవం అని కుడా అందురు. మోక్షమును, అమితానందమును కలిగించమని ఆ భగవంతుని కోరుకోనుచు చేయు శుభకార్యమే" అమృతోత్సవము   ఈ ఉత్సవమును అరువద్ది సంవత్సరములు పూర్తి అయిన తల్లితండ్రులకు వారి సంతానము చేయదగినట్టిదే ఈ మహోత్సవం. ఇందు ఆ...