Sree Sudharshana Homam Importance శ్రీ మహావిష్ణువుకు పంచాయుధాలు ఉంటాయి. అవి: సుదర్శన చక్రం , పాంచజన్య శంఖం , కౌమోదకీ గద , నందా ఖడ్గం , శార్ జ్గ ధనువు ; కింది శ్లోకం పంచాయుధ స్తోత్రంలో సుదర్శన స్తుత్యాత్మకం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణో: చక్రం సదాహం శరణం ప్రపద్యే!! సౌరమాసం – కర్కాటాకంలో – చిత్తానక్షత్రాన సుదర్శన చక్రరాజం అవతరించినట్లు క్రింది తిరునక్షత్ర తనియన్ తెలియజేస్తుంది. కర్కటే చిత్తనక్షత్రే జాతం సవాయ్ధేశ్వరం | విష్ణో: సంకల్ప వృక్షంతం చక్రరాజ మహం భజే !! ప్రపంచ సృష్టిస్థితిలయ కారకుడయిన భగవంతునికి కూడా ఆయుధాలు అవసరమా అనే సందేహం కొందరికి కలుగుతుంది. యథార్థంగా ఆళ్వార్లు ఈ ఆయుధాలను భగవానుని భూషణాలుగా అభివర్ణించి స్తుతించారు. భగవానుడు జరిపే కార్యాలకు తన చిహ్నాలయిన ఆయుధాలను ఉపయోగిస్తుంటాడు. భగవానుని ఆయుధాలన్నింటిలోనూ చక్రత్తాళ్వార్ శక్తి వంతమైనది. పంచాయుధాలు నిత్యసూరి వర్గానికి చెందినవి. ఈ నిత్య సూరులు ...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com