ఓం సూర్య నారాయణాయ నమః
తేది 25-1-2020 శనివారం నుండి మాఘ మాసం ప్రారంభం. ఈనెల ప్రతి రోజు ఆదిత్యహృదయం పారాయణతో పాటు సూర్య నమస్కారాలు మొదలుపెడదాము
రామరామ మహాబాహో,శృణుగుహ్యంసనాతనం
యేన సర్వా నరీన్వత్స,
సమరే
విజయిష్యసి//
ఓ రఘుకుల రామా! పరశురాముని బలాన్నికూడా తీసుకొని
ద్విగుణీకృతబలముతోప్రకాశిస్తున్న రామా !శతృవులనుయుధ్ధములో సునాయాసముగా జయించి
విజయాన్నిపొందడానికి ఉపయోగపడే సనాతనమైనది రహస్యమైన (ఓ)ఈస్తోతా్రన్ని విను.
శ్రీ రమద్వాల్మీకిరామాయణంలోయుధ్దకాండలో 107 ౧౦౭ సర్గరామరావణ యుధ్ధాన్నిచూడటానికి
ఆకాశమార్గం లో దేవతలతో కూడా వచ్చిన అగస్త్య మహర్షి రాముని వద్దకు వచ్చి ఆదిత్య
హృదయస్తోతా్రన్ని ఉపదేశిస్తాడు.
సూర్యోపాసన వల్లమహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుఅక్షయపాత్రని పోందేడుట;మహాభాగవతం దశమస్కందం లో సతా్రజిత్తుకుశ్యమంతకమణి
దొరికిందిట;
ఋక్షరజస్సు అనే వానరానికి సుగీ్రవుడు, కుంతీదేవికి కర్ణుడు పుత్రులుగా దొరికేరుట;అంతెందుకు తేజస్సు కావాలంటే సూర్యోపాసన, సుఖం కావాలంటే సూర్యోపాసన, యశస్సు కావాలంటే సూర్యోపాసన_ ఒకటేమిటి సూర్యభగవానుడు సాక్షాత్తు
ఆరోగ్యదేవత కదా_
ఏదికావాలంటే
అదేపొందచ్చు.
కృష్ణునికి జాంబవతికి పుట్టినసాంబుడు దూర్వాసుని శాపం వల్లకుష్టురోగి అయితే
సూర్యోపాసన చేసి నిరోగి,
సుందరాంగుడిగా
మారాడుట.
సూర్యోపాసనతో బాహ్యాభ్యంతర తిమిరాన్ని పారదో్రలి సాధనలో జ్జానజ్యోతిని సత్వరం
దర్శించుకోడానికి వీలవుతుంది అంటారు విజ్ఞులు. అలాంటి ఆదిత్యహృదయాని్న ఒక్కసారి పరికిద్దాం.
ఆదిత్యహృదయం లో మొత్తం 31 శ్లోకాలు, వెరసి వెయ్యి అక్షరాలు ఉన్నాయి.
మొదటి తొమ్మిది శ్లోకాలు నుతి (స్తుతి) అంటే ఈశ్వరారాధనలో నమకం లాంటివి.
చివరి 10
శ్లోకాలు
శ్తోత్ర మాహాత్మ్యం తెలియ చేస్తాయి.
ఇంకమధ్యలో వున్న 12
శ్లోకాలు
ద్వాదశాదిత్యులన్న మాట.అంటే మన పారాయణకి 6వ శ్లోకం రశ్మిమంతం సముద్యంతం నుంచి మొదలుపెడితే 24వ శ్లోకంవేదాశ్చ క్రతవశ్చైవ వరకూ చె
ప్పుకొంటే చాలు.
Comments
Post a Comment