అనంత చతుర్దశి వ్రతము గురించి శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకు తెలియచేసినట్టుగా మహాభారతం తెలిపినదని చిలకమర్తి తెలిపారు.
జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తూ ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి ఓ జగద్రక్షకా! మేం అనుభవిస్తున్న ఈ కష్టాల నుంచి దూరం కావడానికి మార్గం చెప్పాలని ప్రార్ధించగా అందులకు కృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతము ఆచరించాలని సూచిస్తాడు.
ధర్మరాజు వెంటనే అనంతుడు ఎవరని ప్రశ్నిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ ఆ అనంతుడు అంటే ఎవరో కాదు... ఆ కాలపురుషుడిని నేనే. కాలమే అనంతుడు అని పరమాత్మ బదులిస్తాడు.
కృతయుగమందు సుమంతుడు, దీక్ష అను బ్రాహ్మణ దంపతులకు మహావిష్ణువు అనుగ్రహముతో ఒక కుమార్తె కలుగగా ఆ బాలికకు శీల అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగినారు. ఈ క్రమంలో సుమంతుని భార్య దీక్ష అనారోగ్యముతో మరణించగా సుమంతుడు వేరొక స్త్రీని వివాహమాడెను. ఇలా ఉండగా రూపలావణ్యవతియైన శీలను కౌండిన్యుడు వివాహమాడదలచి సుమంతుని అంగీకారముతో ఆమెను వివాహమాడుతాడు.
అనంతరం శీలతో కలసి ఎడ్లబండిపై తిరుగు ప్రయాణంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగెను. ఇంతలో శీల ఆ సమీప నదీ తీరమందు కొందరు పూజలు చేస్తుండగా వారి వద్దకు చేరి ఆ పూజ గురించి అడుతుంది. వారు అనంత పద్మనాభ వ్రతం గురించి చెబుతారు. ఈ రోజు కనుక విధి విధానంగా ఆ నారాయణుని ఆరాధించి, ఆ ఆరాధనలో ఉంచిన పదునాలుగు ముళ్ళు కలిగిన పట్టుత్రాడు తోరం భర్త భార్య ఎడమ చేతికి, భార్య భర్త కుడిచేతికి కట్టుకుని ధరించిన యెడల అష్ట ఐశ్వర్యాలు, సుఖాలు లభిస్తాయని చెబుతారు. వారు ఇచ్చిన తోరము ధరించి కౌండిన్య మహర్షి వద్దకు రాగానే, మహర్షి ఆమె చేతిని ఉన్న తోరమును చూచి మిక్కిలి ఆగ్రహించి నన్ను వశీకరించుకొనుటకై ఈ తోరం కట్టుకున్నావా అంటూ దానిని తెంచి నిప్పులవైపు విసిరేస్తాడు. శీల ఆ తోరము పాలలో వేసి భద్రపరుస్తుంది.
ఆ క్షణము నుండే కౌండిన్యుడు సకల సంపదలను కోల్పోతాడు. తిరిగి పశ్చాత్తాప మనస్కుడై దీనికి మార్గమేమి? అని భార్యని అడిగి తెలుసుకుని అనంతుని సంతోషపెట్టుటకై అరణ్యమున కేగి తపమాచరిస్తాడు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగానే స్తోత్రము చేసి సాగిలపడతాడు. అనంతుడు అనుగ్రహించి, నీ గృహమునకేగి పిదప పదునాలుగు సంవత్సరములు అనంత చతుర్దశీ వ్రతమాచరించాలని సూచిస్తాడు. ఆ రోజు ధరించిన తోరము సకల శుభములను చేకూర్చుచూ అప్టైశ్వర్యములు ప్రసాదించును అని అనుగ్రహించెను. అట్టి అనంత పద్మనాభ చతుర్దశి వ్రతమాచరించి సర్వులమూ పునీతులమౌదామని
Comments
Post a Comment