Skip to main content

Posts

Showing posts from July, 2025

గురు పౌర్ణమి తేదీ 10-7-2025 గురువారం

ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని ‘గురుపౌర్ణమి‘ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు. వ్యాసభగవానుడిని మానవాళి మెుత్తానికి గురువుగా భావిస్తారు. ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో సంకలనం చేశాడు. అందుకే అతనిడి వేదవ్యాసుడు అని కూడా అంటారు. అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు. అందుకే వ్యాసమహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటారు. అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతంది. ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని పెద్దలు  చెబుతున్నారు.