తిరుమంగై అల్వార్ ను తిరుమంగై మన్నన్ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వారులలో చివరివాడు . అతను హిందూ మతం యొక్క వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా గుర్తింపు పొందాడు. అతను పద్యాల కూర్పులో అత్యంత ఉన్నతమైన అళ్వార్లలో ఒకనిగా పరిగణించబడ్డాడు. అతనికి పరకాలయోగి అని కూడా పిలుస్తారు. జీవిత విశేషాలు అతను కలియుగ ప్రారంభంలో 397 సంవత్సరమునకు సరియగు "నళ" నామ సంవత్సర వృశ్చిక (కార్తిక) మాస శుక్ల పక్ష పూర్ణిమా గురువారమున కృత్తికా నక్షత్రమున "తిరుక్కుఱైయలూర్" అను దివ్యదేశమునందు జన్మించాడు. అతనికి తన తండ్రి ""నీలనిఱైత్తర్" అని నామకరణం చేసాడు. అతను పద్మాంశమున జన్మించిన కుముదవల్లి నాచ్చియార్లను వివాహము చేసికొన్నాడు. అందుకు అతను శ్రీవైష్ణవ ఆరాధనను నిర్వహించుచూ పూజా ద్రవ్యములకై దొంగతనము చేసేవాడు. అతనిని పరీక్షింపదలచి పెండ్లి కుమారుని వేషములో వచ్చిన శ్రీమహావిష్ణువుని కూడా దోచి స్వామి పాదస్పర్శచే జ్ఞానోదయము పొందెను. అతను "నాన్‌కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్ఱుం నామమ్" అని తిరుమంత్రమును ప్రకాశింపజేసిరి. అతను తమ శిష్యులతో కలసి దివ్యదేశ సంచారము చేయుచు పెరు...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com