సంతానము కోరుకొనేవారు - భేష్మ తర్పణం
మాఘ శుద సప్తమి మొదలు ఏకాదశి వరకు అయిదు రోజులను 'భేష్మ పంచకం' అంటారు. కల నిర్ణయ చంద్రిక, నిర్ణయ సింధు, ధర్మ సింధు,కాల మాధవీయం, ......లాంటి గ్రంధాలన్నీ మాఘ శుద్ధ అష్టమినే భీష్మ నిర్యాణ దినముగా వివరించినాయి. భీష్మునికి ఆరోజే తర్పణలు విడిచిపెట్టాలని చెప్పినాయి. ముక్యంగా సంతానము కోరుకొనేవారికి ఈరోజు చాల ముక్యమయినది. భీష్మాష్టమి నాడు తిల అంజలి సమర్పించి, భీష్ముడిని స్మరించేవారికి సంతానప్రాప్తి కలుగు తుందని హేమాద్రి పండితుడు తన గ్రంధాలలో చెప్పినాడు. శ్రాధము కూడా పెడితే మంచిదని పద్మ పురాణము చెబుతున్నది. సంవస్చర పాపం పోవాలంటే ఆనాడు భీష్ముడికి జలాంజలి సమర్పించాలని భారతము చెప్పింది. అందుకే మాఘ శుద్ధ ఏకాదశికి 'భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది.
Comments
Post a Comment