జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. మరికొందరు చెట్లని పెంచడం లో వాటిని కాపాడడం లో ఎంతో ఆసక్తి ని చూపుతుంటారు, తెలిసో తెలియకో వారు, వారి నక్షత్రాలకి సంబందించిన చెట్లని పెంచడం వలన, ఆరోగ్య, ఆర్దిక మరియు ఎన్నో అంశాలను చక్కగా ఆనందిస్తుంటారు. దీన్ని తెలుసుకొని వారికి సంబందించిన వృక్షాల/చెట్లు ను పెంచడం ద్వారా, వృక్షాలు/చెట్లలో దాగిన గొప్ప శక్తుల వలన , ఆరోగ్య, ఆర్దిక పరిస్థితులను మెరుగు పరుచుకోవడమే కాకుండా ,అనుకోని సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఉపకరిస్తాయి . మరియు ఇతరులకు వారికి సంబందించిన వృక్షాలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా, వారు అబివృద్ది చెందడమే గాక పర్యావరణాన్ని కూడా ఎంతో మేలుచేసిన వారవుతారు. భారతీయ సంస్కృతి లో పూజించడానికి అర్హతగలిగినవేన్నో ఉన్నాయి. ప్రతి సంస్కృతీ లోను వారి నమ్మకాలని బట్టి వాటిని ఆచరిస్తు...