మృగశిర కార్తె 8-6-2016 వచ్చిందంటే సకలజనులకు వూరట కలుగుతుంది. అప్పటివరకు గ్రీష్మతాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవాలు తొలకరిజల్లులతో స్వాంతన చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. రుతుపవనాల రాకను మృగశిరకార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభమవుతుంది. జింక తల కలిగివుండటంతో ఈ కార్తెను మృగశిరకార్తెగా వ్యవహరిస్తారు. ఈ కార్తె మనదేశంపై విశేషప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువపనాలు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. అప్పటివరకు నిప్పులు చెలరేగిన భానుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడుతాయి. దేశానికి జీవధార అయిన వర్షాలతో నేలతల్లి పులకరిస్తుంది. రైతులు తొలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. ఏరువాకసాగే కాలం అని కూడా అంటారు. ఈ నక్షత్రం దేవగణానికి చెందినది. అధిపతి కుజుడు. రాశి అధిపతులు శుక్రుడు, బుధుడు. ఈ నక్షత్రంలో జన్మించినవారు మంచి అదృష్టం కలిగివుంటారు. ఇంగువ బెల్లం కలిపిన మిశ్రమం గులికను ప...