సప్త చిరంజీవులు. చిరంజీవులు అంటే చిరకాలం జీవించిఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు. పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం. అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః | కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః || దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ; బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు. 1)అశ్వద్దామ:- ద్రోణాచార్యుని కుమారుడు,మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు. ఇతడు చిరంజీవి. 2)బలి:- ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు,ఇంద్రుని జయించినవాడు,వామనమూర్తి కి మూడడుగుల భూమిని దానం చేసి,అతని చే పాతాళమునకు తొక్కబడిన వాడు . కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గధాధారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు .ఇతడు చిరంజీవి. ఇతని సత్య సంధతకు మెచ్చిన మహా విష్టువు ఈమన్వన్తరములో దైత్త్యేద్రత్వమును , పై మన్వంతరములో దేవేంద్ర పదవిని అనుగ్రహించాడు . 3)వ్యాసుడు :- సత్యవతీ పరాసరుల కుమారుడు.కృష్ణ ద్వయపాయనముని అని పిలవబదేవాడు. అష్టదశా...