శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని
నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే
సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే
ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరాహజయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ
మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా
మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము
చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు
దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము
ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన
ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment