Skip to main content

Posts

Showing posts from March, 2018
हनुमान जयंती 2018: हनुमान जयंती 31 मार्च को पूरे देश में मनाई जाएगी। चैत्र मास की पूर्णिमा को हनुमान जयंती मनाई जाती है। कहा जाता है भगवान बजरंग बली की पूजा में कई नियमों का पालन करना चाहिए। ऐसी मान्यता है कि चैत्र माह की पूर्णिमा को ही हनुमान जी का जन्म हुआ था। इस दिन हनुमान जी को प्रसन्न करने के लिए कई प्रकार के उपाय किए जाते हैं। अभिषेक, पान के पते से अर्चना, हनुमान चालीसा पढ़ना, सुंदर काण्ड पढ़ना इत्यादी हनुमान मंदिरोम्मे होता है. जय श्रीराम....जाया श्रीराम....
31, మార్చ్, 2018 శనివారం, చైత్ర పౌర్ణిమ, శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు). హనుమాన్ విజయం గా చైత్ర శుద్ధ పౌర్ణిమ ను పాటిస్తారు. హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. హనుమంతుని నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది. శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. జై శ్రీరాం...జై శ్రీరాం... నినాదాలతో ప్రపంచం మర్మోగిద్దాo. భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. 31, మార్చ్ చైత్ర పౌర్ణిమ నుండి మే,10 గురువారం వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41.....(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరిక...
పంచాంగ శ్రవణం 2018 ప్రభవాది 60 సంవస్చరములలో 32 వది శ్రీ విలంబి నామ సంవస్చరము. తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. దీని వల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు. లక్ష్మీ కటాక్షానికి, విజయసాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలి. జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందజేస్తుంది. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, రుతువులు, ప్రాణులు కాలస్వరూపమైన ఏడాదిలో నివసిస్తుంటాయి. ఉగాది నాడు ముఖ్యమైంది పంచాంగ శ్రవణం. దీన్ని ఉగాది రోజే ఎందుకు నిర్వహిస్తారంటే తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఉగాదితోనే. కాబట్టి ఆ రోజు ఆలయంలోగానీ, గ్రామకూడలిలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వారి రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవైనా దోషాలుంటే వాటి నివారణకు శాంతి పూజలు నిర్వహించి ఇబ్బందులు తొలగించుకోడానికే పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగానదిలో స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతామనేది పెద్దల న...
గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం. ఈ పురాణంలో ఆచారకాండ (కర్మకాండ), ప్రేతకాండ (ధర్మకాండ), బ్రహ్మకాండ (మోక్షకాండ) అనే మూడు భాగాలున్నాయి. మొదటికాండను పూర్వఖండమనీ చివరి రెండు కాండలనూ కలిపి ఉత్తర ఖండమనీ వ్యవహరిస్తారు. ఈ కాండలొక దాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో వుంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడ పోలిక లేదు. ఆచారకాండలో 240 అధ్యాయాలు, ప్రేతకాండలో 50 అధ్యాయాలు, బ్రహ్మకాండలో 30 అధ్యాయాలు ఉన్నాయి. ఆచారకాండలోని అధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ, పదార్థతత్త్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి, జీవాత్మ మరణానంతర ప్రయాణం, కర్మ, కర్మ నుండి విడుదల - అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలూ, నరకానికి మార్గమూ, ప్రేత జీవనమూ, నారకీయ శిక్షలూ, స్వప్న శకునాలూ, అపరకర్మకాండాదులూ మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి. కర్మకాండ విధింపబడింది. ప్రేతాలు చెప్పిన స్వీయకథలూ ఉన్నాయి. బౌద్ధుల ప్రేతకథ కూడ చెప్పబడడం విశేషం. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే పరమశి...
ఆబ్దికం/ తద్దినం పూజ సామగ్రి వివరాలు  నల్లని నువ్వులు, బాదం ఆకులు/ అరటి ఆకులు/విస్తరి ఆకులు 3, దర్బ కట్ట, బియ్యం 100 grams, గంధం 20 grams, ఆవు నెయ్యి 50 grams, ఆవు పంచికం, ఆవు పేడ కొంచెం, బియ్యం పిండి 1/2 kg., ఆవు పాలు, పెరుగు, తేనె, బెల్లం పొడి, ( అన్నీ కలిపి 100 millilitre), అరటి పండ్లు 6 nos.,తెల్లని వస్త్రం,  ఆచమనం పాత్ర, రాగి కలశం చెంబు 1, తమల పాకులు 15, వక్కలు 11, రూపాయి నాణెములు 11, విడి పూలు, తులసి దళం, జంజం 1, స్వయం పాకం 6 పాకెట్లు, (బియ్యం, కూరగాయలు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, పప్పులు, పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్, etc.) పితృ దేవత లేదా మాత్రు దేవత ఫోటో, దీపం, అగర్బతి, కర్పూరం.ఆల్వార్, ఏమ్బెరుమానార్, జీయర్ దక్షిణ Rs.౧,౧౧౬/-