దీపావళి పూజ ఏర్పాట్లు, పూజా విధానం దీపావళి నిత్య కృత్యాలు: ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది కొత్త బట్టలు కట్టుకోవడం కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం మంచిది ఈరోజు చేయకూడనిది: మద్యమాంసాలను తీసుకోవడం పగలు పూట నిద్రపోవడం. ఈ రోజు ఇంటిలో ఏర్పాట్లు : గుమ్మాలకు తోరణాలు ధరింపజేయడం ఇంటిలో దేవుడి పటానికి బొట్టు పూలతో అలంకరించి పూజించడము. పూజించే విధానం, ఇంట్లో పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరవాలి, దానిపైన దాన్యాన్ని పోయాలి, దారంతో చెప్పిన కలశాన్ని అలంకరించి కొబ్బరికాయతో స్థాపన చేయాలి. లక్ష్మీదేవి ఫోటోలు పెట్టాలి. అమ్మ వారికి ధరింప చేయవలసినవి కాటుక అద్దం చెక్క దువెన ఎరుపు రంగు గాజులు మొదలైన అలంకరణ సామాగ్రి. అభిషేకము పంచామృతంతో చేయాలి అనగా ఆవుపాలు ఆవుపెరుగు ఆవునెయ్యి తేనె మరియు పంచదారలతో అభిషేకించాలి. అమ్మవారికి చేయవలసిన నైవేద్యము కొబ్బరికాయ అరటిపండ్లు పాయసాన్నము పంచఫలములు అనగా అయిదు రకాల పండ్లు అమ్మవారికి నివేదించాలి. మారేడు పత్రితో లక్ష్మీదేవిని పూజించడం మరింత శుభకరం. కర్పూర హారతి తో లక్ష్మీ దేవి మంగళ హారతి పాట పాడాలి. వ్యాపార గృహం అయినట్లయితే మంచి గుమ్మడితో దిష్టితీసి కొట్టాలి.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment