పుష్య మాసం - నువ్వులు , బెల్లం ప్రాముఖ్యత పుష్యమాసం శని మాసం. ఈ మాసం లో శని ప్రభావం అధికంగా ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం శని మన శరీర జీవ నాడి కారకుడై ఉంటాడు. ఈ జీవ నాడి యొక్క ఒక శాఖ హృదయ స్పందనను ,రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి ,శరీరంలోని కొవ్వు పదార్ధం తగ్గడం వల్ల , మకర మాసం మొదలు అయ్యే సమయానికే ఈ కొవ్వు పదార్ధపు కొరతను తీర్చాలని చెప్పబడింది. ఇందు వల్ల రవి ప్రభావం ( ఎండ వేడిని) ఎదుర్కోవటానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చెయ్యడం వల్ల, హృదయ స్పందన సక్రంగా ఉండేటట్లు చెయ్యగల "నువ్వులు -బెల్లం " తినాలి అనే నియమం పెట్టారు. పుష్యమి నక్షత్రం శని నక్షత్రం ..ఈ నక్షత్రానికి బృహస్పతి అధిదేవత . శనికి అధి దేవత యముడు. "యమం " అంటే "సం యమం" అని అర్ధం, అంటే ఆధీనంలో ఉంచుకోవటం. అంటే శరీరాన్ని ఆరోగ్యపు ఆధీనంలో ఉంచుకోవటం ఈ జీవ నాడి మూలంగ మాత్రమే సాధ్యమవుతుంది. జీవనాడి యొక్క ఈ క్రియకు కొవ్వు పదార్ధం తక్కువ అయితే శ్క్తి లేకపోవడం, అనారోగ్యం మొదలు అయినవి కలుగుతాయి. వీటిని నివారించే శక్తి కేవలం నువ్వులు బెల్లానికి మాత్రమే ఉంది. శని ధర్మ దర్శి...