రుతు ధర్మం ప్రకారం
హిందువులు జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం భాద్రపద
శుద్ధ చవితినాడు (తేది 02-09-2019 Monday) ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు.
వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని
సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటాయి.
పుష్పాలు విచ్చి పరిమళాలు
వెదజల్లుతుంటాయి.
నదులలో నీరు నిండి
జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని
జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి
మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం.
గణేష పూజకు ఒండ్రుమట్టితో
చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేమంటే
జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం
వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. అంతేకాకుండా బంగారం,వెండి,పంచలోహాలు,రాగి తో
చేసిన విగ్రహాల కంటే కూడా అన్ని రకాల ఫలితాలు ఈ మట్టి విగ్రహములకు పూజలు చేయటం వలన
కలుగాతాయని గణపతి పురాణం చెబుతోంది. " మృత్తికాంశం సుందరమ్ స్నిగ్ధాం సంచలనం పాషాణ వర్జితాం " శుభ్రం చేసిది. మెత్తనిది, రాళ్ళు, ఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చమైన నీటితో తడిపి ప్రతిమచేయవలెను
నీళ్లు తేటపడతాయి. అదీకాక
మట్టిని తాకడం, దానితో బొమ్మను చేయడం వల్ల
మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని
ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వినాయకునికి ఎక్కువ ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వులు అనగా గరక పోచలు. గ్యాస్ అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరిక పోచలు వినాయకుడు పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ కలిగినవి. గణేశుడే స్వయంగా " మత్పూజా భక్తినిర్మితా మహీత స్వల్పకవాపీ వృధా దూర్వంకురై ర్వినా " అంటే భక్తితో చేసిన పూజ గొప్పది.గరిక లేకుండా పూజ చేయరాదు. " వినా దూర్వాంకు రై : పూజా ఫలంకేనాపి నాప్యతే తస్మాదిషసి మద్భ త్వరిత రేఖా భక్తీ సమర్పితా దూర్వా దతతీ యత్ఫలం మహత్ నతత్క్ర్ తుశతై రాదా నైర్ ర్వ్ ఉష్టానా సంచయై : "
అయితే పదిరోజుల పాటు పూజలు
చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత
రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో
ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా
గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే.
అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను
మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, నైవేద్యాలు
సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు. by Rama chary pandit 9989324294
Comments
Post a Comment