Skip to main content

కణ్ణినుణ్ శిరుత్తాంబు తెలుగు అర్థము


మథురకవి ఆళ్వారుడి దివ్య పాదములకు నమస్కారములు
 10. ఈ సంసారమును, నా భార్యాపిల్లలను వదిలిపెట్టినందుకు, మరియు ఆ దేవుడిని పూజించని కర్మఫలమునకు, ఎటువంటి పాపఫలితము వచ్చినా కాని, నాకు బ్రతుకు తెరువు అనుకూలించక పోయినా సరే, వేదార్థ రహస్యములను తెలుసుకున్న నేను, స్వామీ, నన్ను నమ్మి, ఇంత భాగ్యమును అనుగ్రహించిన, మీ దివ్య పాదపద్మములకు నిండుగా, సేవ చేసే భాగ్యమును ప్రసాదించుము, అని, కోకిలలు మైమరపుతో గొంతెత్తి తియ్యగా పాడే, పరిమళ పూతోటలు కలిగిన కురుకాపురిలోని, విశేష ప్రజ్ఞాశాలి, ఆ నమ్మాళ్వారుడిని వేడుకొన్న నేను ఆ భాగ్యమును పొందితిని.
 9. ఆ దేవుడి సేవలో, ఆ నమ్మాళ్వారు లీనమయి, తనను తాను మరచిపోయి, ఆ దేవుడిని కీర్తిస్తూ, ఎన్ని జన్మలు తపస్సు చేసినా కూడా తెలుసుకోలేని, అద్భుతమైన వేదార్థ రహస్యములను తెలుసుకొని, ఎవరో తెలియని నన్ను, పూర్తిగా నమ్మి, నా మనస్సులో వాటిని నింపిరి. అందుకు ప్రతిఫలముగా, నా జీవితమంతా, ఆయనకు సేవ చేయడం తప్ప, నేను, ఏమీ చెయ్యలేను.
 8. అతి కష్టమైన వేదముల యొక్క అర్థమును, అందరికి సులభముగా, అర్థమయ్యేటట్లు, మథురమైన పలుకులతో, అపరిమితమైన ఆర్తి నిండిన, భక్తి పారవశ్యముతో, నమ్మాళ్వారు ద్రవిడ భాషలో, వేయి పాటలను పాడి, వినిపించారు. ఆ భగవంతుడి కరుణాకటాక్షముల గురించి, ఆ భగవంతుడిని చేరే మోక్ష మార్గము గురించి, ఇంత సులభముగా చెప్పిన పాటలు, ఈ లోకములో, మరి ఎక్కడా లేవు.
7.కురుకాపురి నగరపు రాజు అయిన కారిసూరి పుత్రుడైన నమ్మాళ్వారు, తన దయతో, నా పూర్వ జన్మ పాపకర్మలు అన్నిటిని, పూర్తిగా నాశనము చేసి, నన్ను కరుణించి, తన సుందర దివ్య వేదములు అయిన తిరువాయిమొజి, తిరువాశిరియము, తిరువిరుత్తము, పెరియ తిరువందాది గ్రంథములను నాకు అనుగ్రహించి, అప్పగించిరి. అమృతముతో సమానమైన ఈ సుందర ద్రవిడ వేదములను, నేను ఎనిమిది దిక్కులలోని ప్రజలకు, అర్థమయ్యేటట్లు, రమ్యముగా వినిపిస్తాను.
 6. నేను, నమ్మాళ్వారుడి భక్తుడను, అయినప్పటి నుండి, నా జీవితము వున్నంత వరకు, ఆయనను పూజించి, సేవించే భాగ్యము నాకు లభించినది. నా సర్వస్వమూ ఆయనయే, అని పూజించడం వలన, ఆకాశమును తాకే, పెద్ద పెద్ద మేడలు కలిగిన ఆ కురుకాపురి నగరములోని, విశేషమైన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆ నమ్మాళ్వారుడి అనుగ్రహమును పొందితిని. అందుకే, ఆయన నన్ను, ఎన్నడూ, వదలక, రక్షించును.
 5. నమ్మాళ్వారుడిని కలవక ముందు, నేను దేవుడిని నమ్మి, పూజించాను. అందరి వలె, ఈ ప్రపంచములో వున్న భోగ భాగ్యములతో, సంసారము చేసితిని. కాని, నేను తీర్థయాత్రలు చేస్తూ, రంగు రంగుల బంగారు మేడలు కలిగిన, ఈ కురుకాపురిలో, ప్రకాశవంతముతో వెలిగే, విశేష ప్రజ్ఞాశాలి అయిన ఈ నమ్మాళ్వారుడిని చూసిన తరువాత, నేను, ఈ ప్రపంచములోని అన్నిటిని వదిలి, ఆయనకు భక్తుడను, సేవకుడను అయితిని. అప్పటి నుండి, ఆయన గొప్పతనము తప్ప, నాకు వేరొకటి కనిపించడం లేదు. ఇప్పుడు, నాకు ఈ జన్మ రహస్యము,వేదార్థములు, జన్మ సార్థకత, అన్నీ తెలిసి, చరితార్థుడను అయ్యాను.
 4. చతుర్వేదములు చదివిన పండితులు, నేను దేవుడిని పూజించుట లేదు, అని నన్ను తప్పు పట్టి, నీచముగా, చిన్న చూపు చూస్తున్నారు. అయినా సరే, నాకు వచ్చిన నష్టమేమి లేదు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, అన్నీ, నా సర్వస్వమూ అయిన ఆ నమ్మాళ్వారే.
 3. నేను ఎన్ని దేశములు తిరిగినా, ఎంతమందిని కలిసినా, నా మనస్సులోని ఈ అభిప్రాయము మారదు. చివరకు వైకుంఠములోని ఆ శ్రీమన్నారాయణుడే, లక్ష్మీదేవితో కలిసి, ఎదురైనా సరే, నా దేవుడు ఆ నమ్మాళ్వారుడే. ఆయనకు మాత్రమే, నేను సేవ చేసి, పూజించెదను.
 2. నమ్మాళ్వారుడి వేదాంత ఉపదేశములకు, మనసారా తృప్తి పడి, ఆయన యొక్క భక్తి భావనకు, నేను దాసుడను అయితిని. ఆ దేవుడి గొప్పతనము కంటే, నా గురువుగారి గొప్పదనమే, వెయ్యిరెట్లు ఎక్కువగా, నాకు కనిపించినది. అందుకే, నేను మైమరచి, ఆ నమ్మాళ్వారుడిని కీర్తించి, ఆనందమును పొంది, ఆయన దివ్య పాదములనే, నేను, ఆశ్రయించితిని. విశేష ప్రజ్ఞాశాలి అయిన మా నమ్మాళ్వారు తప్ప, నా కంటికి ఏ దేవుడు కనిపించడం లేదు. అందుకే, నేను దేశ దేశముల తిరుగుతూ, ఆయన ఆ భగవంతుడి గురించి, తెలిపిన ఉపదేశములను, మథురమైన పాటల రూపములో పాడి, ఆయన గొప్పతనమును తెలిపెదను.


1.అంతు తెలియని మాతృత్వపు భక్తి భావనలో, లీనమయిన ఆ యశోదాదేవి చేత, సన్నని ముడులతో, అల్లిన చిన్న త్రాడుతో, రోటికి కట్టబడిన ఆ శ్రీకృష్ణుడి కంటే, దక్షిణ భారత దేశములో వున్న, కురుకాపురి నగరములోని, విశేష ప్రజ్ఞాశాలి అయిన, నమ్మాళ్వారు అంటేనే, నాకు చాలా ఇష్టము. ఆయన మీద భక్తి భావముతో, ఆయన పేరు పలకాలి, అనే ఆలోచన, నా మదిలో మొదలవగానే, నా మనస్సు సంతోషముతో వువ్విళ్లూరి, నా నోటి నుండి, అమృతము వలె లాలాజలము వూరును. ఆ దేవుడి పేరు పలుకుట కంటే, మా నమ్మాళ్వారు పేరును పలుకుటయే, నాకు చాలా చాలా ఇష్టము.

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.