Skip to main content

Posts

Showing posts from January, 2020

మాఘ మాసం సూర్య నమస్కారాలు

ఓం సూర్య నారాయణాయ నమః తేది 25-1-2020 శనివారం నుండి మాఘ మాసం ప్రారంభం. ఈనెల   ప్రతి రోజు   ఆదిత్యహృదయం పారాయణతో పాటు సూర్య నమస్కారాలు  మొదలుపెడదాము రామరామ మహాబాహో , శృణుగుహ్యంసనాతనం యేన సర్వా నరీన్వత్స , సమరే విజయిష్యసి// ఓ రఘుకుల రామా! పరశురాముని బలాన్నికూడా తీసుకొని ద్విగుణీకృతబలముతోప్రకాశిస్తున్న రామా !శతృవులనుయుధ్ధములో సునాయాసముగా జయించి విజయాన్నిపొందడానికి ఉపయోగపడే సనాతనమైనది రహస్యమైన (ఓ)ఈస్తోతా్రన్ని విను. శ్రీ రమద్వాల్మీకిరామాయణంలోయుధ్దకాండలో 107 ౧౦౭ సర్గరామరావణ యుధ్ధాన్నిచూడటానికి ఆకాశమార్గం లో దేవతలతో కూడా వచ్చిన అగస్త్య మహర్షి రాముని వద్దకు వచ్చి ఆదిత్య హృదయస్తోతా్రన్ని ఉపదేశిస్తాడు. సూర్యోపాసన వల్లమహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుఅక్షయపాత్రని పోందేడుట ; మహాభాగవతం దశమస్కందం లో సతా్రజిత్తుకుశ్యమంతకమణి దొరికిందిట ; ఋక్షరజస్సు అనే వానరానికి సుగీ్రవుడు , కుంతీదేవికి కర్ణుడు పుత్రులుగా   దొరికేరుట ; అంతెందుకు తేజస్సు కావాలంటే సూర్యోపాసన , సుఖం కావాలంటే సూర్యోపాసన , యశస్సు కావాలంటే సూర్యోపాసన _ ఒకటేమిటి సూర్యభగవానుడు సాక్షాత్తు ఆరోగ్యదేవత కదా _ ఏది...

శ్రీ సుదర్శన హోమం విశేషం

సుదర్శన హోమం:- శ్రీమహావిష్ణుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం.హిందూ పురాణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి, నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గృహ ప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది. మానవుని జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయింపబడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోమం చేయడం జరుగుతుంది.

ప్రథమ సంవస్చరం – సంకల్ప విధానం పూజ సామగ్రి

పూజ సమయం 11-45 a . m . తేదీ 24-2-2021  నల్లని నువ్వులు 100 grams, , బియ్యము 7  packets each one kilo,     తమల పాకులు 25, వక్కలు 25,పసుపు 50 gms .,కుంకుమ 50 gms , ఆవు నెయ్యి  100 grams 6  పాకెట్లు  ,పెరుగు డబ్బాలు 6 చిన్నవి, బియ్యం పిండి 1/2 కిలో, (పిండాలకు),అరటిపండ్లు ఒక డజను,  ఆవు పాలు 100 ml, ఆవు మూత్రం 100 ml, కొత్తవి గ్లాసులు 5 ,  ఆవు పేడ కొంచెం, గందం కొంచెము  , తెల్లని వస్త్రము towel 1,మోదుగ ఆకు    విస్తార్లు 10 , దొప్పలు 10, పంచామృతం 200 ml.,రూపాయి బి ళ్ళలు, 15,  ఆచమనం పాత్ర, అరటి పండ్లు 1 డజన్  ,తేనె చిన్న సీసా , తండ్రి గారి ఫోటో కు   పూల మాల, కుల్లా     పూలు 1/4 kilo, తులసి దళాలు , అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, అయ్యగారికి ఆకు కూరలు 6 packets  , చింతపండు   6 packets, బెల్లం 6 packets , పెసర పప్పు 6  packets , 6 అయ్యగార్లకు మరియు పూజ   అన్నికలిపి దక్షిణ (fee ) Rs.4,000/-