ఫిబ్రవరి 9 ఆదివారం రోజు మహామాఘి, మాఘ స్నానంతో పాప పరిహారం, ఆరోగ్య ప్రాప్తి! మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి.ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి
చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీనిని మాఘమాసం అంటారు. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసంగా దీనిని భావిస్తారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టి ఇది మాఘమాసమైంది. ఇక మాఘమాసంలో స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రస్నానంగా భావించి, పాప పరిహారం కోసం నదీస్నానాలు చేయడం మాఘ సంప్రదాయం. మాఘస్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణం తెలిపింది. మృకండు మహర్షి- మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని ని పురాణ కథనం.
Comments
Post a Comment