కోవిడ్-19 వ్యాధికి గురైన బాధితులు వైద్యం
తీసుకోకుండా పారిపోకుండా ఉండేందుకు లేదా నిర్బంధంలో ఉండటానికి నిరాకరించినపుడు
వారిని అదుపులోకి తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్
(అంటువ్యాధుల నివారణ చట్టం)-1897ని అమలు
చేసింది. ఇది 123
ఏళ్ల నాటి చట్టం.
కర్ణాటకలోని మంగళూరులో
కరోనావైరస్ లక్షణాలు గుర్తించిన ఒక రోగి హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి
పారిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసింది.
రైలు లేదా ఇతర మార్గాల ద్వారా
ప్రయాణించే వారికి వైద్య పరీక్షలు నిర్వహించే హక్కు అధికారులకి ఉంటుంది.
వ్యాధి సోకిన రోగులను
హాస్పిటల్లో విడిగా ఉంచవచ్చు.
పరీక్షలు నిర్వహించే అధికారి
ఎవరికైనా వ్యాధికి గురైన అనుమానితులను అదుపులోకి తీసుకుని వైద్యం అందించే హక్కు
ఉంటుంది.
ఎవరికైనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వారిని
అదుపులోకి తీసుకుని నిర్బంధంలో పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
ఈ చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష ఏమిటి
ఈ చట్టాన్ని ధిక్కరించిన వారికి
భారతీయ శిక్షా స్మృ తిలోని సెక్షన్ 188 ప్రకారం
శిక్ష విధించవచ్చు.
చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో
అధికారులపై చట్టపరమైన కేసులు నమోదు చేసేందుకు వీలులేదు.
ఈ చట్టం ప్రకారం... ఎవరైనా రోగి
వైద్యం తీసుకోవడానికి గాని, అది
మరింత వ్యాప్తి చెందకుండా నిర్బంధంలోకి వెళ్ళడానికి నిరాకరించినా అటువంటి వారిని
నిర్బంధంలోకి తీసుకుని చికిత్స అందించే అధికారం ఉంటుంది. వైద్య పరీక్షల ఫలితాలు
వచ్చిన రోజు నుంచి 14 రోజుల
వరకు రోగిని అదుపులో ఉంచవచ్చు.
సెక్షన్ 188 ప్రకారం... ఎవరి ప్రాణానికైనా భంగం
వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 1000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.
Comments
Post a Comment