ఉగాది.. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ.. ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు కాబట్టి ఉగాదిగా మారింది. యుగం అంటే రెండు లేక జత అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాలకు ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాబట్టి ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. విక్రమార్కుడు, శాలివాహన చక్రవర్తి ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించారు.
శ్రీవికారినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీశార్వారి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం మార్చి 25 బుధవారం. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఛైత్ర శుద్ధ పాడ్యమి మొదలైనా పండగ మాత్రం బుధవారం జరుపుకోవాలి. ఎందుకంటే శాస్త్రోక్తంగా సూర్యోదయం సమయంలో తిథి ప్రకారం పండుగ జరుపుతారు.
ఉగాది రోజున అత్యంత ముఖ్యమైనది పచ్చడి. ఈ పచ్చడి ఏ సమయంలో తీసుకోవాలనేది కూడా వేద పండితులు తెలియజేశారు. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, పచ్చడి తయారు చేయాలి. దీనిని దేవునికి సమర్పించిన తర్వాత ఉదయం 6.00 గంటల నుంచి 11.00 మధ్యన తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది అత్యంత అనుకూలమైన సమయమని తెలిపారు. ‘శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం’ అనే ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా చదివి పచ్చడి తీసుకోవాలి. వందేళ్లపాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం దీని అర్థం.

Comments
Post a Comment