శివాభిషేక ఫలములు : గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com