దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి (తేదీ 29-10-2022 )నాడు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా నాగుల చవితిని చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ఈ ఏడాది నాగుల చవితిని (Nagula Chaviti 2022) ఈ పండుగను ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతంలోనూ జరుపుకుంటారు. నాగదోషం, రాహు-కేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగారాధన చేస్తే అవన్నీ తొలగిపోతాయి. నాగుల చవితి విశిష్టత >> నాగులచవితి రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. >> ఈ రోజున నాగారాధన చేయడం వల్ల సర్పదోషం తొలగిపోయి.. శుభఫలితాలు కలుగుతాయి. >> మీ జాతకంలో పితృదోషం ఉన్నవారు నాగ పూజ చేయడం మంచిది. >> ఈ పూజను చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలున్నా, వ్యాధులన్నా, బాధలున్నా దూరమవుతాయి. >> ఈ చవితిని జరుపుకోవడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com