తొండరడిప్పొడి ఆళ్వారు రచించిన తిరుప్పళ్లియొజుచ్చి. దివ్యమైన మేలుకొలుపు సూర్యుడు తూర్పు దిక్కున ఆకాశపు ఉదయగిరిన అందమైన అరవింద ప్రకాశ తేజోమయుడై వచ్చివున్నాడు. ఉదయకాలపు వెలుతురు చక్కగా రాగా, దట్టమైన చిమ్మ చీకటి అంతా నశించినది. మంచి పరిమళపు సువాసనలు వెదజల్లు రంగురంగుల పువ్వులు అన్నీ వికసించి తియ్యని తేనెతో నిండి పలకరిస్తున్నవి. నీ దర్శనమునకై దేవతలు, రాజులు అందరూ వచ్చి అన్ని వైపులా నిండి వున్నారు. వారు ఎక్కి వచ్చిన ఏనుగుల గుంపు యుక్క ఘీంకార శబ్దములు భేరీ వాయిద్య ధ్వనితో కలిసి శబ్దించు అలల సముద్ర ఘోషవలె అన్ని దిక్కుల ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా. తూర్పు దిక్కు నుండి వీచు చల్లని గాలి పూలతీగలపై నిండివున్న మల్లెలు, మొల్లల పూలవాసనలను గ్రహించి మంచి పరిమళ సువాసనాభరితముగా వీచుచున్నది ఇదిగో. పూలపడకన నిద్రించు హంసజంటలు తెల్లవారుఝామున పడే లే మంచు బిందువులతో తడిసిన తమ చక్కని అందమైన రెక్కలను విదిల్చి నిద్ర లేచినవి. మొసలి యొక్క తెల్లని కోరలకి చిక్కి, విపరీతము...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com