ఆషాడ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడానికి అంకితం చేయబడింది. ఈ కాలంలో కఠోర వ్రతాన్ని ఆచరించిన వారికి రెట్టింపు పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఇది ఆషాడ మాసంలో వస్తుంది కనుక కామిక ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు శివుడిని ఆరాధించడం వలన అతని అనుగ్రహం లభిస్తుంది. కొన్ని పురాణాల ప్రకారం కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే గొప్ప సంతానం కలుగుతుంది. కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే మరు జన్మ రాదని విశ్వాసం. శాస్త్రాల ప్రకారం సరైన పద్ధతిని, నియమాలను పాటిస్తూ సరైన సమయంలో కామికా ఏకాదశి వ్రతం ఆచరించినప్పుడే ఈ వ్రతానికి ఫలితం దక్కుతుంది. కామిక ఏకాదశి రోజు భక్తి శ్రద్దలతో చేసే పూజతో కోరికలు నెరవేరతాయి. కామికా ఏకాదశి వ్రతం గురించి, బ్రహ్మ దేవుడు దేవర్షి నారదునితో చెబుతూ పాపాలకు భయపడేవారు కామిక ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలని చెప్పారు. అప్పులు తొలగిపోవాలంటే: కామిక ఏకాదశి రోజు సాయంత్రం రావి చెట్టుకు నీళ్ళు సమర్పించి దాని కింద నెయ్యి దీపం వెలిగించాలి. మహావిష్ణువు రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ ను...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com