ఈ ఏడాది ఇందిరా ఏకాదశి ఉపవాసం పితృ పక్ష సమయంలో వస్తుంది. పూర్వీకుల మోక్షానికి ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి పాపాలు నశించడమే కాకుండా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వ్యక్తి ఏడు తరాల వరకు వాళ్ళ పూర్వీకుల దగ్గరకు వెళతాడని చెబుతారు. తన పూర్వీకులు కూడా పుణ్యాన్ని పొందుతారు. వారు తమ పితృలోకం నుండి విముక్తి పొంది స్వర్గంలో స్థానం పొందుతారు. శ్రీమహావిష్ణువును పూజించి ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల భక్తులు సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. వారి జీవితంలో ఆనందం , శ్రేయస్సు వస్తాయి. విష్ణుమూర్తికి నైవేద్యాలలో తులసిని తప్పకుండా చేర్చండి. విష్ణువు తులసి లేని ఆహారాన్ని స్వీకరించడు అని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. హిందూ గ్రంథాలయ ప్రకారం ఇందిరా ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. వైకుంఠప్రవేశం లభిస్తుంది. పూర్వీకులు స్వర్గం చేరుకుంటారని నమ్ముతారు.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com