Skip to main content

తిరుమంగై ఆళ్వార్ 🙏🌸

 🌸🙏

     చోళ సామ్రజ్యములో ఆలినాడు అను ఒక సామంత రాజ్యం కలదు.  దీనిని పాలించిన సామంత రాజు సంతానం పేరు నీలన్. ఇతనికి పరకాలన్ ( పరకాలయోగి) అను మరో నామం కూడ ఉంది.  నీలన్ చిన్ననాటి నుంచి ధైర్యవంతుడు.  సకల శాస్త్రములు నందు ప్రావీణ్యత పొందినాడు.  తండ్రి మరణం తో ఆలినాడు  ప్రాంతమును పాలించినాడు.


     ఆలినాడు ప్రాంతమును నందలి తిరునాంగూరు గ్రామంలోని ఒక కొలను నందు కలువ పువ్వ పైన ఒక బాలిక అవతరించింది.  కపిల ముని శాపంతో సుమంగళి అను దేవకన్య భూమి మీద జన్మించుట జరిగింది. ఆ బాలికను పెంచిన తండ్రి కుముదవల్లి అను నామంతో పిలిచేవాడు.  నీలన్ ఆమె సౌందర్యమును చూసి ముచ్చటపడి వివాహం కోసం తండ్రిని సంప్రదించుతాడు.  విష్ణు భక్తిరాలు అయిన కుముదవల్లి ఒక షరత్తు విధించుతుంది. ఆ షరత్తు ప్రకారము భర్త ప్రతిరోజు 1008 మంది విష్ణుభక్తులుకు అన్న సంతర్పణ చేయాలి.  కొంత కాలము నకు నీలన్ రాజ బొక్కసం హరించుకొని పోయింది.  అనంతరం  వైష్ణువారాధన నిముత్తం దారి దోపిడీలకు దిగజారుతాడు.  శ్రీ లక్ష్మీనారాయణలు  బాటసారులుగా వచ్చి, నీలన్ కు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించుతారు.  నాటి నుంచి వైష్ణువారాధనకు తన జీవితం ధారపోస్తాడు.  


     పరకాలయోగి, తన భార్య అయిన కుముదవల్లి సమేతంగా ఉత్తర దేశ యాత్రలు ముగించి తిరుగు ప్రయాణంలో ఆలినాడుకు బయులుదేరుతాడు. మార్గ మధ్యన శీర్గాళి గొప్ప శైవ క్రేత్రం ఉంది. ఇది జ్ఞానసంబంధర్ జన్మ స్ధలం.  ఇతడు 63 నయనార్ల సర్వ శ్రేష్ఠుడు.  పరకాలయోగి తన శిష్యు బృందముతో విజయయాత్రగా శీర్గాళి క్రేత్రం చేరుతాడు.  వీరిని జ్ఞానసంబంధర్ శిష్యులు అడ్డుకుంటారు.  శైవులుకు మరియు వైష్ణువులకు మధ్య వాదోపవాదులు జరుగుతాయి.  దీనికి పరిష్కారముగా జ్ఞానసంబంధర్  శీర్గాళి క్రేత్రం మీద ఒక  కవిత్వం చెప్పమంటాడు.  పరకాలయోగి చెప్పిన దశకమును మెచ్చిన జ్ఞానసంబంధర్ ఒక బంగారు శూలాన్ని కానుకగా అందించుతాడు.  పరకాలయోగిని శ్రీ వైష్ణువులు తిరుమంగై ఆళ్వార్ గా పిలించేవారు .  మహావిష్ణువు యొక్క ధనస్సు అంశంగా ఆరాధించుతారు.


     పరకాలన్ ఒక దొంగల ముఠాకు నాయకుడుగా వ్యవహరించేవాడు.  కొల్లగొట్టిన బంగారం, సంపదను శ్రీరంగం ఆలయ ప్రాకార నిర్మాణలు కోసం ఖర్చు చేసేవాడు. తిరుమంగైయాళ్వార్ చోర వృతిలో ఉన్న పెరుమాళ్ యొక్క సంపూర్ణ కటాక్షం పొందినాడు.  తిరుమంగైయాళ్వార్ రచనలు బహు ఖ్యాతి పొందినాయి.  నాలాయిర దివ్య ప్రంబంధం నందలి 4000 పాశురాలలో 1137 పాశురాలును తిరుమంగైయాళ్వార్ రచించినాడు.  ఆళ్వార్ 86 దివ్యదేశాలు సందర్శించి మంగళాశాసనములు అందించినారు.  తిరుమంగైయాళ్వార్ చివరి రోజులలో తిరుక్కురున్ గుడి క్షేత్రం చేరి, వైష్ణువ నంబి పెరుమాళ్ సేవలో గడిపి పరంపదం చెందినాడు.  క్షేత్రం లోని తిరుప్పార్కడల్ నదీ తీరంలో తిరుమంగై ఆళ్వార్  సమాధి కలదు.  


     తిరుమంగైయాళ్వార్ జన్మ స్ధలం కురైయులుర్.  దీనికి సమీపంలో తిరునగరి అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ కళ్యాణ రంగనాథన్ పెరుమాళ్ ఆలయం ఉంది.  ఆళ్వార్లు దివ్యదేశంగా కీర్తించారు.  శ్రీ కళ్యాణ రంగనాథన్ పెరుమాళ్ ఆలయ ముఖ మండపం నందు తిరుమంగైయాళ్వార్ కు ఒక చక్కటి ద్వజస్ధంభం కలిగిన సన్నిధి కలదు.  తిరుమంగై ఆళ్వార్ జన్మ నక్షత్రం నాడు తిరు ఉత్సవాలు జరుగుతాయి.  తెలుగువారు మార్గశిర, శుద్ధ చతుర్ధశి, కృతిక నక్షత్రం నాడు తిరు ఉత్సవాలు నిర్వహించుతారు.

     

     చిదంబరం - కుంభకోణం రైలు మార్గంలో శీర్గాళి రైల్వేస్టేషన్ కలదు.  శీర్గాళి పట్టణం ను పూర్వం షియాలిగా పిలిచేవారు.  శీర్గాళి కు సుమారు 12 కీ.మీ దూరం లో తిరునగరి ఉంటుంది.   శీర్గాళి  నుంచి టాక్సీలు, ఆటోలు దొరుకుతాయి. తిరునగరి 3 కీ.మీ దూరంలో మంగై మఠం కలదు. భక్తులుకు అన్న సంతర్పణ జరుగుతుంది. 🌸🙏🌸🙏శుభం🌸🙏🌸🙏🌸🙏🌸🙏🌸🙏

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.