Skip to main content

Posts

Showing posts from January, 2025

మాఘ మాసం విశేషాలు

  శుభకార్యాల మాసం మాఘ మాసం మాఘమాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో 30 రోజులు పుణ్య తిధులే. మాఘ మాసం జనవరి 30 (గురువారం) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28 శుక్రవారంతో ముగుస్తుంది. జనవరి 30 మాఘ శుద్ధ పాడ్యమి : పరమ పవిత్రమైన మాఘ మాసం ప్రారంభం. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆరంభం. ఆలయాలలో మాఘ పురాణం ప్రారంభం. జనవరి 31 మాఘ శుద్ధ విదియ : చంద్రోదయం. మాఘ మాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. ఫిబ్రవరి 2 మాఘ శుద్ధ చవితి  : దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ. తిల చతుర్థి, కుంద చతుర్థి. ఫిబ్రవరి 3 మాఘ శుద్ధ పంచమి/ షష్ఠి  : వసంత పంచమి , శ్రీ పంచమి. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం. మహా కుంభ మేళాలో నాలుగవ రాజస్నానం. ఫిబ్రవరి 4 మాఘ శుద్ధ సప్తమి  : రథసప్తమి. తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు. ఫిబ్రవరి 5 మాఘ శుద్ధ అష్టమి  : భీష్మాష్టమి ఫిబ్రవరి 6 మాఘ శుద్ధ నవమి : మధ్వనవమి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్...