Skip to main content

మాఘ మాసం విశేషాలు

 శుభకార్యాల మాసం మాఘ మాసం

మాఘమాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో 30 రోజులు పుణ్య తిధులే. మాఘ మాసం జనవరి 30 (గురువారం) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28 శుక్రవారంతో ముగుస్తుంది.

  • జనవరి 30 మాఘ శుద్ధ పాడ్యమి: పరమ పవిత్రమైన మాఘ మాసం ప్రారంభం. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆరంభం. ఆలయాలలో మాఘ పురాణం ప్రారంభం.
  • జనవరి 31 మాఘ శుద్ధ విదియ: చంద్రోదయం. మాఘ మాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది.
  • ఫిబ్రవరి 2 మాఘ శుద్ధ చవితి : దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ. తిల చతుర్థి, కుంద చతుర్థి.
  • ఫిబ్రవరి 3 మాఘ శుద్ధ పంచమి/ షష్ఠి : వసంత పంచమి , శ్రీ పంచమి. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం. మహా కుంభ మేళాలో నాలుగవ రాజస్నానం.
  • ఫిబ్రవరి 4 మాఘ శుద్ధ సప్తమి : రథసప్తమి. తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు.
  • ఫిబ్రవరి 5 మాఘ శుద్ధ అష్టమి : భీష్మాష్టమి
  • ఫిబ్రవరి 6 మాఘ శుద్ధ నవమి: మధ్వనవమి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం.
  • ఫిబ్రవరి 7 మాఘ శుద్ధ దశమి: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ కామాక్షిదేవి చందనోత్సవం, దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి పుష్పయాగం.
  • ఫిబ్రవరి 8 మాఘ శుద్ధ ఏకాదశి: భీష్మ ఏకాదశి.
  • ఫిబ్రవరి 9 మాఘ శుద్ధ ద్వాదశి : ద్వాదశి పారణ
  • ఫిబ్రవరి 10 మాఘ శుద్ధ త్రయోదశి : సోమ ప్రదోష వ్రతం
  • ఫిబ్రవరి 12 మాఘ శుద్ధ పౌర్ణమి : మాఘ పౌర్ణమి. నదీ స్నానం. కుంభ సంక్రమణం, రామకృష్ణ తీర్ధ ముక్కోటి, మహా కుంభ మేళాలో అయిదవ రాజస్నానం.
  • ఫిబ్రవరి 13 మాఘ బహుళ పాడ్యమి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన ప్రణయ కలహ మహోత్సవం
  • ఫిబ్రవరి 16 మాఘ బహుళ చవితి : సంకష్ట హర చతుర్థి
  • ఫిబ్రవరి 17 మాఘ బహుళ పంచమి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన పెద్ద శాత్తుమొర
  • ఫిబ్రవరి 18 మాఘ బహుళ షష్ఠి : తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • ఫిబ్రవరి 19 మాఘ బహుళ సప్తమి : తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • ఫిబ్రవరి 22 మాఘ బహుళ నవమి : తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి గరుడసేవ.
  • ఫిబ్రవరి 24 మాఘ బహుళ ఏకాదశి : సర్వ ఏకాదశి, విజయ ఏకాదశి
  • ఫిబ్రవరి 25 మాఘ బహుళ ద్వాదశి : భౌమ ప్రదోషం, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి రధోత్సవం
  • ఫిబ్రవరి 26 మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి : మహాశివరాత్రి పర్వదినం. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. తిరుపతి కపిలేశ్వర స్వామి వారి నంది వాహనోత్సవం, తిరుకచ్చినంబి ఉత్సావారంభం
  • ఫిబ్రవరి 27 మాఘ బహుళ చతుర్దశి/అమావాస్య : తిరుపతి కపిలేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం
  • ఫిబ్రవరి 28 మాఘ బహుళ అమావాస్య : తిరుపతి కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. దర్శఅమావాస్య. ద్వాపర యుగాది, మాఘమాసం సమాప్తం.

పరమ పవిత్రమైన మాఘ మాసంలో నెల రోజుల పాటు శివ కేశవులను పూజించే వారిపట్ల శివకేశవులు ప్రసన్నులై శుభాలు కలిగిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాఘ మాసంలో శాస్త్రంలో చెప్పిన విధముగా పండుగలు జరుపుకుందాం. ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకుందాం.


Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.