భీష్ముడు మాఘ శుక్ల అష్టమి నాడు తనువు చాలించినా వైకుంఠానికి చేరడానికి మూడు రోజులు పడుతుంది. కావున ఏకాదశి నాడు భీష్ముడు మోక్షాన్ని పొందాడని ప్రసిద్ధి. అందుకే మాఘ శుక్ల ఏకాద శి భీష్మ ఏకాదశి అని అంటారు. మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి గా పిలుస్తారు. అందుకే ఈ రోజున భీష్మునికి ఇష్టమైన విష్ణు సహస్రనామమును ఈ ఏకాదశి నాడు ఉపవాసముతో మూడుసార్లకు తగ్గకుండా శక్తి మేరకు పారాయణము చేయాలి. ఈ రోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించాలి. విష్ణు సహస్ర నామాలను పఠించలేని వారు "శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే" అనే ఈ శ్లోకాన్ని చదివితే విష్ణు సహస్ర నామాలు చదివినదానితో సమానమని.. పార్వతీ దేవికి పరమ శివుడు వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com