పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. తిరుప్పాణాళ్వార్ పన్నెండు అళ్వార్ల క్రమంలో పదకొండవ వాడిగా పరిగణించబడతాడు. తిరుప్పాణాళ్వార్ శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం లోని ప్రధాన దైవం రంగనాథస్వామికి అనుబంధంగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతను ఆ దైవంలోనే ఐక్యం అయినట్లు నమ్ముతారు. తిరుప్పాణాళ్వార్ యొక్క పది శ్లోకాలను అమలనాతిపిరన్ అని పిలుస్తారు. అతని రచనలు నాలాయిరం దివ్య ప్రబంధంలోని 4000 చరణాలలో పది శ్లోకాలు. తిరుప్పాణాళ్వార్ రచనలు వైష్ణవ మతం యొక్క తాత్విక, వేదాంత ఆలోచనలకు దోహదపడ్డాయి. తిరుప్పాణాళ్వార్, ఇతర అళ్వార్ర్‌ల శ్లోకాలు రోజువారీ ప్రార్థనలలో భాగంగా దక్షిణ భారతదేశంలోని చాలా విష్ణు దేవాలయాలలో పఠిస్తారు.
🌸🙏 చోళ సామ్రజ్యములో ఆలినాడు అను ఒక సామంత రాజ్యం కలదు. దీనిని పాలించిన సామంత రాజు సంతానం పేరు నీలన్. ఇతనికి పరకాలన్ ( పరకాలయోగి) అను మరో నామం కూడ ఉంది. నీలన్ చిన్ననాటి నుంచి ధైర్యవంతుడు. సకల శాస్త్రములు నందు ప్రావీణ్యత పొందినాడు. తండ్రి మరణం తో ఆలినాడు ప్రాంతమును పాలించినాడు. ఆలినాడు ప్రాంతమును నందలి తిరునాంగూరు గ్రామంలోని ఒక కొలను నందు కలువ పువ్వ పైన ఒక బాలిక అవతరించింది. కపిల ముని శాపంతో సుమంగళి అను దేవకన్య భూమి మీద జన్మించుట జరిగింది. ఆ బాలికను పెంచిన తండ్రి కుముదవల్లి అను నామంతో పిలిచేవాడు. నీలన్ ఆమె సౌందర్యమును చూసి ముచ్చటపడి వివాహం కోసం తండ్రిని సంప్రదించుతాడు. విష్ణు భక్తిరాలు అయిన కుముదవల్లి ఒక షరత్తు విధించుతుంది. ఆ షరత్తు ప్రకారము భర్త ప్రతిరోజు 1008 మంది విష్ణుభక్తులుకు అన్న సంతర్పణ చేయాలి. కొంత కాలము నకు నీలన్ రాజ బొక్కసం హరించుకొని పోయింది. అనంతరం వైష్ణువారాధన నిముత్తం దారి దోపిడీలకు దిగజారుతాడు. శ్రీ లక్ష్మీనారాయణలు బాటసారులుగా వచ్చి, నీలన్ కు అష్టాక...