సూర్యునితో సంబందించిన ప్రతి గ్రహము కాంతి విహీనముగా ఉండును. అట్టి గ్రహములు శుభాఫలములు ఈయవు. ఇట్లున్దుట గ్రహమును ఆస్థాన్గత దోషము అందురు. గురు, శుక్రులు మనకు ఆకాశములో కనబడరు. దీనినే మూడమి అందురు. దీర్ఘయుసు కోరువారు భావి, కొలను, యాగము, గమనము, క్షురకర్మ, దేవతా ప్రతిష్ట, వివాహములు, ఉపనయనములు, విధ్యారంబము, నూతన గృహా ఆరంబము, కర్ణవేధ, మహాదానములు, నూతన మంత్రానుస్తానములు చేయుట, మొదలగు శుభ కర్మలు చేయరాదు. షోడశ మహాదానములు, నూతన వధూ ప్రవేశము, కేశఖందనము, అష్టక శ్రాధము, చాతుర్మాస వ్రతములు, సమావర్త్నము, మంత్ర గ్రహణ దీక్ష, దంత, రత్న, భూషనాది పనులు, సన్యాస స్వీకారము మొదలగునవి మూడమి నందు చేయరాదు.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment