చైత్ర శుద పాడ్యమి ఏ వారము అవుతుందో ఆ వరాదిపతి ప్రకారముగా వర్ష నిర్ణయము చేయవచ్చును. ఈ ఏడాది మంగళవారము తో ప్రారమ్బమూ అయింది కనుక కుజుడు అధిపతి కావున కుజ ప్రభావముతో వర్షాలు అంతగా పడకపోవచ్చును. జ్యేష్ట మాసములో చిత్తా, స్వాతి, విశాఖ నక్షాత్రలల్లో ఆకాశములో మేఘాలు లేకుండా ఉంటె మరియు శ్రావణ మాసములో ఇవే నక్షత్రలల్లో వర్షము కురిస్తే ఆ సంవస్త్రములో పంటలు దారాళముగా పండుతాయి. జ్యేష్ట మాసము ప్రారంబము లో శుక్ల పక్షములో ఆర్త నక్షత్రముతో ప్రారంబంయ్న౧౦ నక్షత్రములలో వర్షము కురిస్తే జల పొలాలకు ఎత్తి వర్షము ఉండదు, కాని మెత్త పొలములు జలముతో నిండి ఉండును.ఒక ప్రుచాకుడు వర్షము గురించిన ప్రశ్న తో వచినపుడు, వర్షాన్ని సూచన చేసే జ్యోతిష్యుడు అట్టి సమయములో నీటిలో మునుగుచున్న లేదా చేతిలో నీరు ఉన్న, లేదా నీరుగల ప్రాతములో ఉన్నచో ఆకస్మిక వర్షము ఉండగలదు. చీమలు తమ గ్రుద్దులను చీమలపుట్ట నుంచి తీసుకొని పోతున్న్నపుడు, కప్పలు ఆకస్మికముగా వాటి అరుపులు మొదలు పెట్టిన ఆకష్మిక వర్షము వచ్చును. పిల్లులు,మున్గీసలు,పాములు తమ చిలములలో నివసించుచు ఇతర కీటకాలు మతుస్తితి లో ఉన్నట్లుగా నలుదిక్కలకు స్వేచ్చగా తిరుగాడుతున్న ఆకస్మిక వర్శముని సూచించును. నెమల్లు నాట్యము చేస్తున్న,పిల్లలు మట్టితో వంతెనలు కతుడుంటే తప్పకుండ ఆకస్మిక వర్షము వచ్చును. నీటి పక్షులు వాటి రెక్కలను ఎండా వేడిమితో ఆరబెట్టుకోనుచున్నచో ఆకస్మిక వర్శమునకు సూచన.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment