ఏక వింశతి మహాదోశాలు అనగా ౨౧ ప్రత్యేక దోషాలు. వివాహాది కార్యక్రమాల విషయములో వీనిని గమనిస్తారు. ౧. పంచాంగ శుద్ధి, ౨. సూర్య/చంద్ర సంక్రమణము, ౩. కర్తరి దోషము, ౪. చంద్రుడు ౬,౮,౧౨ భావాలలో ఉండుట, ౫. ఉదయఅస్తమయ దోషము, ౬. వారజనిత దుర్ముహుర్థము, ౭. గండాంత దోషము, ౮. పాపశాద్వార్గులు, ౯. భ్రుగు (శుక్ర) శతకము౬ వ భావములో ఉండుట) కుజాస్తమం (కుజుడు ౮ వ భావములో ఉండుట),౧౧.దంపతుల లగ్నమునకు అష్టమ లగ్నం, ౧౨. రాశి విశాఘతికాదోశము, ౧౩. కునవామ్ష, ౧౪. వారదోశము, ౧౫. ఖర్జూర చక్ర సమంగ్రిక, ౧౬. గ్రహనోత్పాతం, ౧౭. క్రూరగ్రహ విధ నక్షత్రము, ౧౮. క్రూహ సంయుతం, ౧౯.అకాల ఘర్జిత వృష్టి, ౨౦. మహాపాత దోషము, ౨౧. వైధృతి దోషము. (
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment