ద్వారాలు, తలుపులు, పి కప్పు, కలిగి శాస్త్ర నియమానుసారంగా నిర్మించిన నూతన గృహములో ముందుగా శాస్త్రోక్తవిధిగా వాస్తు హోమాలు ఇంటి దేవతా పూజ, నవ గ్రహ పూజ జరిపి గృహ దేవతలకు నైవేద్యాలు ఇత్చి, అన్న శాంతిచేసి, సుముహుర్తములో మంగళ వాద్య యుక్తముగా సువాసిని, బ్రాహ్మణా, పరిజన, బందు సాహితుడి గృహ ప్రవేశముచేయాలి. యజమాని ధర్మ పత్ని సమేతుడి, బ్రాహ్మణులూ, కన్యలు, ఆవు, అనే వాటిని వెంటబెట్టుకుని మంగళ వాద్యవేద ఘోస్తాలతో కూదినవడి పుష్ప తోరణాలతో అలంకరించబడ్డ నూతన గృహానికి ముందుగా ప్రదక్షిణము చేసి ముహూర్త కాలములో గృహములోకి ప్రవేశించాలి. ఆ తర్వాత మేస్త్రీకి,జ్యోతిష్కునికి, వాస్తు పండితునికి బ్రాహ్మణులకుపురోహితాది శ్రేయోభిలాషులకు శక్తి మేరకు దక్షిణలు వస్త్రాలు ఇత్చి గౌరవము ఇవ్వాలి. ముహూర్తానికి ఒక రోజుముందుగా ఇంటి పనులన్నీ సర్వాలంకార శోభితంగా అలంకరించాలి. ద్వారాలకు విధిగా తలుపులను అమర్చాలి. ఆగ్నేయ మూలలో పొయ్యి అమర్చి పాలు పొంగించే క్రియ చేపట్టాలి. నవధాన్యాలను ద్వారము వద్ద ఉంచాలే. ఇంటిదేవతను మంగళ హారతిని పటుఉకుని ధర్మ పత్ని కుడి చేయి పట్టుకుని కుడికాలు లోనికి పెట్టి గృహ ప్రవేశముచేయాలే. పడుకునే గదికి వెళ్లి సర్వాలంకార శోభితమైన మంచమునకు నమస్కరించి దానిమీద ఇద్దరు కూచోవాలే. ఆతరువాత గణపతి పూజ, పుణ్యః వాచనము మంత్రములతో ఆవు పంచితము చల్లించి పాలు పొంగించాలే. కనీసముమూడు రాత్రుల నిద్ర చేయాలి. తరువాత శాద్రశో పేత భోజనములు అందరితో కలిసి చేయాలి. ఈవిదంగా చేసుకోన్నచో ఆఇంటివారు ఆనంద జీవితమును గడుపుదురు. ఈవిధముగా చేయకపోతే ఆపదలు కలుగుతుంటాయి.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment