సర్వవ్యాపక స్వరూపుడు, సర్వాన్తర్యామి, సకల దేవతా స్వరూపుడు- శ్రీ సూర్యనారాయణమూర్తి.
‘‘ఘాణ్ ప్రేరణౌ సువతి ప్రేరయతి వ్యామారేషు ఇతి సూర్యాః’’ సర్వ వ్యాపారములను అనగా సర్వకార్యములను చేయుటకు ప్రాణులను ప్రేరేపించువాడు- సూర్యభగవానుడు.
మఖా నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసము- మాఘమాసం. మఖా నక్షత్రం- సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. ఆరోగ్యాన్నిచ్చేవాడు భాస్కరుడు. కనుక, మాఘమాసంలో సూర్యారాధన విశేష ఫలితాల్నిస్తుంది. మాఘమాసంలో ముఖ్యంగా నదీ స్నానం. దీపారాధన, సూర్యునికి అర్ఘ్యప్రదానం, దానం చెప్పబడ్డాయి. నదీ స్నానంతో బాహ్యశుద్ధి, సూర్యారాధనతో, దానములతో అంతశ్శుద్ధి కలుగుతుంది. జీవనం సుసంపన్నమయి ఆనంనదయం అవుతుంది.
సూర్య సంబంధమైన విషయాలను మనకి తెలియపరచేవి. ఋగ్వేదంలోని మహాసౌరము, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం- అరుణమంత్రం, త్రుచ, పురాణేతిహాసములు, వాగ్గేయకారుల కీర్తనలు మున్నగునవి. మహిమాన్వితమైన మాఘమాసంలో వచ్చే సూర్య సంబంధమైన పండుగలు. మహనీయుల జయంత్యుత్సవములు, ఆరాధనలు, చదువుల తల్లి అనుగ్రహమును పొందే పర్వదినములు, జాతరలు, మహాశివరాత్రి .

భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి:
ఒక ప్రతిజ్ఞను చేసి దాన్ని జీవితమంతా ఆచరించి ఆదర్శంగా ఉండటం మహోదాత్తమైన విషయం. అలా ప్రతిజ్ఞ చేసి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన కారణజన్ముడు భీష్ముడు. అందుకే ‘‘్భష్మ ప్రతిజ్ఞ’’ అని చెప్పారు. పాండవులకు శ్రీకృష్ణుడు అంపశయ్య మీద వున్న భీష్ముని చేతనే ధర్మ ప్రబోధం గావించాడు. మాఘ శుద్ధ అష్టమి, ఏకాదశి ద్వాదశి భీష్మ చరిత్రను జ్ఞప్తికి తెస్తాయి. మనశ్శాంతినిచ్చి సర్వకార్య జయమును చేకూర్చే ‘‘విష్ణుసహస్రనామం’’ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు మహా పర్వదినం- భీష్మ ఏకాదశి.

Comments
Post a Comment