సుదర్శనం : దీని పుట్టుకను గురించి
మూడుకథలున్నాయి.
1. సూర్యభగవానుడు విశ్వకర్మపుత్రిక అయిన
సంజ్ఞను పరిణయమాడతాడు. సూర్యతేజాన్ని భరించలేనని సన తన తండ్రి విశ్వర్కర్మతో
చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం ద్వారా సూర్యతేజస్సును తగ్గిస్తాడు.
యంత్రంలో సూర్యుని పెట్టి త్రిప్పిన సందర్భాన రాలిన రజం వల్ల విశ్వకర్మ చక్రాన్ని
తయారు చేస్తాడు. ఇది విష్ణువుకు ఇవ్వబడుతుంది. (విష్ణుపురాణం – 3వ
ఆంశం – అధ్యాం 2).
2. ఇంద్రుడు వర్షాన్ని వర్షించడంవల్ల
ఖాండవదహనాన్ని అడ్డుకుంటాడు. ఆ సందర్భాన సుదర్శనాన్ని, గాంఢీవాన్ని
కృష్ణార్జులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. అందువల్ల సుదర్శనానికి అగ్నేయం అని కూడా
పేరు. ఖాండవదహనం పూర్తయ్యాక ఈ ఆయుధాలు తిరిగి గ్నికి ఇవ్వబడతాయని కూడ ఒకచోట
వ్రాయబడింది.
3. సుదర్శనాయుధాన్ని శివుడు కృష్ణునికి
ఇచ్చినట్లు కూడ మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక
దైత్యుని సమ్హరించేందుకు గాను చక్రన్ని శివుడు విష్ణువుకు ఇస్తాడు. దానిని శివుడు
సుదర్శనచక్రం అని పిలుస్తాడు.
సుదర్శనానికి సంబంధించి వివిధ
పురాణలలో చాలా గాథలున్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర
ఉంది. విష్ణువు దుష్టసంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా
ప్రయోగించినట్లు పురాణగాథల వల్ల తెలుస్తోంది.
సుదర్శనశక్తి అద్భుతమైంది. ఇది
శత్రువులను అగ్నివలె దహిస్తుంది. శత్రుసంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే
సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో, అప్పుడు అది సూర్య తేజో
విరాజితమవుతుంది. శత్రుసంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది.
మహాభారతం ఆదిపర్వం 16వ
ఆధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉంది.
Comments
Post a Comment