ఈరోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా. 👉 ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు. సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు. 👉 ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే.. కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమః! వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!! భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు. ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది. 1.కశ్యపుడు, 2.అత్రి, 3.భరద్వాజుడు, 4.విశ్వామిత్రుడు, 5.గౌతముడు, 6.జమదగ్ని, 7.వసిష్ఠుడు... వ...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com