శ్రీమన్ నాథమునులు జన్మ నక్షత్రం 5-7-2017 నాడు ఉంది. వీరనారాయణ పురంలో ఈశ్వర భట్టాళ్వార్ నకు జన్మించారు.వారికి రంగనాథముని మరియు నాథ బ్రహ్మర్ అని నామధేయములు కలవు. వారు అష్టాంగ యోగం మరియు దైవ సంగీతంలో నిష్ణాతులు. వీరే అరయర్ సేవని దివ్య దేశములలో ప్రవేశపెట్టారు. ఇప్పటికి మనం శ్రీ రంగం, ఆళ్వార్ తిరునగరి , శ్రీ విల్లిపుత్తూర్ లలో సేవించవచ్చును.
నాథమునులు వారి తండ్రి మరియు కుమారునితో ( ఈశ్వర ముని) కూడి మధుర, బృందావనం , గోవర్ధన గిరి, ద్వారక,బదరికాశ్రమం, నైమిశారణ్యం మొదలగు దివ్య దేశములకు వెళ్ళిరి. వారు గోవర్ధనపురం అనే ఊరిలో స్వామి యమునా నది రూపంలో ప్రవహిస్తున్న యమునా నది ఒడ్డున ఉండిరి. ఒక రోజు స్వామి నాథమునులకు కలలో కాట్టుమన్నార్ గుడికి తిరిగి వెళ్ళమని ఆదేశించిరి . వారు తిరుగు ప్రయాణంలో వారణాసి, పూరి , సింహాచలం, తిరుమల, ఘటికాచలం, కాంచీపురం ( అక్కడ మిగిలిన దివ్య దేశములు), తిరువహీంధ్రపురం, తిరుక్కోవలూరు, శ్రీ రంగం, కుంభకోణంలలో ఉన్న పెరుమాళ్ళకు మంగాళాశాసనము చేసి చివరికి వీరనారయణపురమమునకు చేరిరి.
Comments
Post a Comment