Skip to main content

Posts

Showing posts from November, 2018

Chiluku Dwadasi | Soma Pradosha Vratham | Significance | Shubha Dinam | ...

పూదత్తాళ్వార్  జయంతి  ఈరోజు  16-11-2018 శుక్రవారం . ఆళ్వా రులలో రెండవవాడు పూదత్తాళ్వార్. సంప్రదాయ గాథల ప్రకారము ఇతడు సిద్ధార్ధి సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ నవమి బుధవారము ధనిష్టా నక్షత్రమున (పొయ్‌గై ఆళ్వారు అవతరించిన మరుసటినాడు) మహాబలిపురము (తిరుక్కడల్మల్లై) లో బండి గుఱిగింజ పూవులో అవతరించాడు. 'పూతము' అనగా యథార్థము, ఆత్మ అని అర్ధాలు. తన పాశురాలలో యథార్థమును చెప్పినందువలనా, సర్వేశ్వరునికి ఆత్మగా ఉన్నందువలన ఇతనికి 'పూదత్తాళ్వార్' అన్నపేరు వచ్చింది. భూతాహ్వయుడనీ, మల్లపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు గదాయుధమైన  కౌమోదకికి  ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము. పూదత్తాళ్వార్ ఆచార్యుడు నేనముదలియార్ (విష్వక్సేనుడు). తిరువారాధనము ఆళ్వాకళ్‌నైనార్. ముగ్గురు ఆళ్వారులు భగవద్దర్శనము కలిగి పులకించినపుడు పూదత్తాళ్వార్ పాడిన నూరు పాశురములు 'ఇరణ్డాన్ తిరువందాది' (రెండవ వంద ముక్తగ్రస్త గేయాలు) అనబడుచున్నాయి.  దివ్య ప్రబంధాలలో  ఇవి రెండవ భాగము. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా నుండుట వలన ఈ పాశురములు "అందాది" అనబడ్...
శ్రీ సత్యనారాయణ స్వామి     పూజ సామగ్రి పసుపు , 1 00 grams,   కుంకుం 10 0 grams,   శ్రీ గంధం ,   బియ్యం 3 కిలోలు ,   తమల పాకుల 10 0,   వక్కలు 25 ,   కర్జూరము 21 ,   పసుపు కొమ్ములు 11, అయిదు రకముల పండ్లు , 5 చొప్పున , అరటి పండ్లు ఒక డజాన్, , ఆవు పాలు లీటరు   పెరుగు , 1/2 kg. తేనె ,   నెయ్యి 1/2 kg, jaggery ½ kg.   పూలు 1 కిలో ,   పూల దండ 2 ,   తులసి దండ 1 , రూపాయి బిళ్ళలు , 15 ,   రాగి చెంబులు 2 ,   అరటి కొమ్మలు , 4,   మామిడి ఆకులు ,   తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2   కనుములు 2 ,   ఎందు కొబ్బరి 2 , కొబ్బరి కాయలు 8 , సత్యనారాయణ స్వామి ఫోటో , పూజా   పీటము ,   అగర్బత్తి , కర్పూరము ,   గోధుమ రవ్వ 1 ½ కిలో ,   కాజు , kissmiss, బాదం పలుకులు , etc.   yaalak, lavanga, పచ కర్పూరం, కుం కుం పూవు,తీర్థం పొడి.   కంకణముల దారం ,   ఆవు పంచితం ,   జంజీరము 1 .   ఆవు నెయ్...
మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు, Helping Trees for Human Being from Narakam మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు Helping Trees for Human Being from Narakam మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది.  శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు. పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి. వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది. శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı ఇతర పక్షులు పీకలు పట్...

Samskrutam Nerchukundam | EP 53 | 06-07-18 | SVBC TTD

పుణ్యః వాచనం పూజ సామాగ్రి పసుపు 200 గ్రాములు, కుంకుం 50 గ్రాములు,గంధం చిన్న డబ్బా, బియ్యం 3 కిలోలు, పూలు, పూల దండ, ఆవు పంచితం, ఆవు పేడ, అరటిపండ్లు 6, మామిడి కొమ్మ 1, రాగి చెంబు, గ్లాసులు 5, తమలపాకులు, 25, వక్కలు 15, రూపాయి బిళ్ళలు, 15, అగర్బతి, కర్పూరం, కొబ్బరి కాయ, 1, దక్షిణ Rs.1,౦౦౦/-
ధన్వంతరి జయంతి నవంబరు 5,సోమవారం  దేవవైద్యుడు ధన్వంతరి శ్రీమహావిష్ణువు అవతారమని పురాణాల్లో వుంది. నారాయణుడికి సంబంధించిన ఇరవై ఒక్క అవతారాలను వ్యాసభాగవతం వివరిస్తుంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేశారు. ఇందులో తొలుతగా హాలాహ‌లం రాగా ఈశ్వరుడు దాన్ని స్వీకరించి కంఠంలో వుంచుకున్నాడు. తరువాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవిలు ఆవిర్భవించారు. అనంతరం ధన్వంతరి ఒక చేత అమృత భాండం, మరో చేతిలో ఆయుర్వేదశాస్త్రంతో జన్మించాడు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి క్షీరసాగరం నుంచి పుట్టినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించిన ధన్వంతరి తనకు స్థిరనివాసం కల్పించాలని మహావిష్ణువును ప్రార్థించగా రెండో ద్వాపరంలో నీకు ఖ్యాతి కలుగుతుంది అని వరమిస్తాడు. అధర్వణవేదంలోని ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. భారతీయ సంప్రదాయ వైద్యంఆయుర్వేదం. ఇందులో పలు రోగాలకు తీసుకోవాల్సిన చికిత్సల గురించి సమగ్రమైన సమచారం వుంది. మన ప్రాచీన చరిత్రలో వైద్యులుగా పేర్కొన్న సుశ్రుతుడు, చరకుడు మొదలైనవారి వైద్య విధానాలకు ధన్వంతరి ఆయుర్వ...