పూదత్తాళ్వార్ జయంతి ఈరోజు 16-11-2018 శుక్రవారం . ఆళ్వారులలో రెండవవాడు పూదత్తాళ్వార్. సంప్రదాయ గాథల ప్రకారము ఇతడు సిద్ధార్ధి సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ నవమి బుధవారము ధనిష్టా నక్షత్రమున (పొయ్‌గై ఆళ్వారు అవతరించిన మరుసటినాడు) మహాబలిపురము (తిరుక్కడల్మల్లై) లో బండి గుఱిగింజ పూవులో అవతరించాడు. 'పూతము' అనగా యథార్థము, ఆత్మ అని అర్ధాలు. తన పాశురాలలో యథార్థమును చెప్పినందువలనా, సర్వేశ్వరునికి ఆత్మగా ఉన్నందువలన ఇతనికి 'పూదత్తాళ్వార్' అన్నపేరు వచ్చింది. భూతాహ్వయుడనీ, మల్లపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు గదాయుధమైన కౌమోదకికి ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.
పూదత్తాళ్వార్ ఆచార్యుడు నేనముదలియార్ (విష్వక్సేనుడు). తిరువారాధనము ఆళ్వాకళ్‌నైనార్. ముగ్గురు ఆళ్వారులు భగవద్దర్శనము కలిగి పులకించినపుడు పూదత్తాళ్వార్ పాడిన నూరు పాశురములు 'ఇరణ్డాన్ తిరువందాది' (రెండవ వంద ముక్తగ్రస్త గేయాలు) అనబడుచున్నాయి. దివ్య ప్రబంధాలలో ఇవి రెండవ భాగము. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా నుండుట వలన ఈ పాశురములు "అందాది" అనబడ్డాయి. ఈ ఇరణ్డాన్ తిరువందాదిలో శ్రీరంగము, తిరుమల, మహాబలిపురము, తిరుక్కోవలూరు, కంచి, అడకసింగరు, తిరుక్కోట్టియూర్, తిరునీర్మలై దివ్య దేశములలోని సర్వేశ్వరుని స్తుతి చేయబడింది.
పూదత్తాళ్వార్ తిరుక్కోవలూర్‌లో పరమపదించాడు.
ఈ ఆళ్వారు తిరునక్షత్ర తనియన్ :
-
- తులా ధనిష్ఠా సంభూతం | భూతం కల్లోలమాలినః ||
- తీరే ఫుల్లోత్పలేమల్లా | పుర్యామీడే గదాంశకం ||
-
- మల్లాపుర వరాధీశం | మాధవీ కుసుమోద్భవమ్ ||
- భూతం నమాఙియోవిష్ణోః | జ్ఞానదీపమకల్పయత్ ||
Comments
Post a Comment