తేది 18-12-2018 నాడు వైకుంఠ ఏకాదశి ని
తెలుగువారు ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ పండుగ విషయంలో
చెప్పతగిన ప్రత్యేకత ఒకటి ఉన్నది. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ
ఏకాదశి సౌరమానప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్రమణం,సూర్యోదయము
కంటే ముందే నిద్ర లేవ్వాలి.
ఒకటిస్వర్గ ద్వారం : రెండు ముక్కోటి: మూడు వైకుంఠ. ఇందులో మొదటిది అయిన స్వర్గ ద్వార నామవిషయం. ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ అప్పడు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణం చేత ఈ పండుగకు దక్షిణాదిని కొన్ని ప్రాంతాలలో స్వర్గద్వారం అనే నామం కూడా కానవస్తూ ఉంది. ముక్కోటి యనగా మూడుకోట్ల మూడుకోట్ల దేవతలా దినమున శ్రీరంగమో లేక లేదా దివ్యక్షేత్రమున జేరుదురను ప్రతీతి ఉంది. విష్ణువు వైకుంఠానుండి మూడు కోట్ల దేవతలతో ఈనాడు భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనేపేరు వచ్చిందని సాధారణంగా చెబుతారు.
"కృత యుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకొని "ముర" అనే అసురుడు రాజ్యపాలనం చేస్తూ ఉండేవాడు. వాడు దేవతల్ని గారిస్తూ వచ్చాడు. అప్పడు దేవతలు వెళ్లి వైకుంఠంలో విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల దీనాలాపాలు విని అప్పడు విష్ణువు వైకుంఠాన్నుంచి భూమి మీదకు దిగి వచ్చి మురాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ సంహారం ఈ ఏకాదశినాడు జరిగింది. విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి భూమి మిూదకు వచ్చి శత్రుసంహారం చేసిన రోజు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది." స్వర్గద్వారం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మున్నగు నామాలతో వ్యవహరించబడే ఈ పర్వదినాన దేవాలయముల ఉత్తరద్వారమునందు శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మము లేదని శాస్త్రప్రమాణము. ఈ దినమె శ్రీరంగ క్షేత్రమున శ్రీరంగ దేవాలయ ద్వారస్థ భగవదాలోకన మహోత్సవం. మహత్తుగల ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి మహోత్తమమైంది. విష్ణ్వాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని బాగా జరుపుతారు.నేను ఈరోజు మదీనగూడ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరా స్వామి దేవస్తానము విధులలో ఉంటాను. సాయంత్రము పూట నాచారం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్తానములో అద్యయన ఉస్చవాలలో ఉంటాను.

Comments
Post a Comment