వివాహ సమయంలో పెళ్లిపందిరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మనిషి జీవితంలో ప్రధానమైన ఘటమైన పెళ్లి కార్యక్ర మానికి దేవతలందరి ఆశీర్వాదాలుండాలనే భావనతో ప్రకృతితో కూడిన మండపాలను నిర్మించడం ఆచారంగా మార్చారు. పెద్దలు సరిసంఖ్యతో పెళ్లిపందిర్లను నిర్మించి, కొబ్బరి ఆకులతో పచ్చని పందిర్లు నిర్మించే వారు. వీటిని చతురస్రాకారం, అష్టభుజి ఆకారంలో వేయడం పరిపాటి. పందిరి కింద ముత్యాల పందిరిని కొబ్బరి ఆకులతో అందంగా తీర్చుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం చాలా మంది ఇంటి ముందు 16 గుంజలతో పందిరి వేస్తారు. దీనికి తల్లి గుంజలు, పిల్లగుంజలు వేస్తారు. ఈ గుంజలను జాజు, సున్నతో ఆలంకరిస్తారు. ఈ గుంజలపై గురిగి (చిన్న మట్టికుండ)ని రవికగుడ్డ (జాకేట్ వస్త్రం)తో కట్టి దానిపై కంచుడు (మట్టి ప్రమిద)ను పెట్టి పెళ్లికి ముందు రోజు, పెళ్లి రోజు, తర్వాత రోజు ఇలా మూడు రోజులు దీపారాధన చేస్తారు. పచ్చని పందిరిని అల్లనేరెడు, మామిడి, కానుగ ఆకులతో నింపుతారు. పిల్లగుంజకు ఒక వస్త్రంలో నవధాన్యాలు, నాణేంను కట్టి వాటిని పెళ్లి కూతురితో కట్టిస్తారు. దానికిందా ముత్యాల పందిరి వేస్తారు. ముత్యాల పందిరి వధూవరులకు రక్షణ వలయంగా భావిస్తారు. పెళ్లి పందిరి వరకు నడిచిన జంట అక్కడికి చేరిన తర్వాత అవాంతరాలు రావొద్దనేది దీని పరమార్ధం.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment