Skip to main content

Posts

Showing posts from 2019

Vykunta Ekadashi on 6-1-2020 Monday -

Vykunta Ekadashi on  6-1-2020 Monday - Vaikuntha Ekadashi is also known as  Mukkoti Ekadashi . It is believed that  Vaikuntha Dwaram  or the gate of Lord's inner sanctum is opened on this day and devotees who observe fast on Vaikuntha Ekadashi attain salvation by going to Heaven. Vaikuntha Ekadashi is very important day for Tirumala Venkateswara Temple at Tirupati and Sri Ranganathaswamy Temple at Srirangam. On this day all Sri Vyshnavite temple main doors opens from North side. North side door entrance is most important on this day.

సూర్య గ్రహణం 26-12-2019 ఉదయం గం// 8 ని// 26 నుండి ఉదయం గం//10- ని// ల 57 వరకు

సూర్యగ్రహణం అంటే తెలుసు కదా.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు.. రాహువు లేదా కేతువు స్థానంలో ఉన్నప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుంది.ఈ గ్రహణం మూల నక్షత్రం వాళ్ళు ,ధనుస్సు, మకర, కుంభ రాశుల వారు చూడరాదు. వీరు బంగారు రాహు,కేతు వెండి,చంద్ర బిమ్బములను పూజించి ఆవు నెయ్యితో నిండిన కంచు గిన్నెను , వస్త్రములను ,నువ్వులతో తగిన దక్షిణలు కల్పి దానమీయవలయును. మరియు రావి చెట్టుకు 21 ప్రదక్షిణములు చేయవలయును.  సైన్స్ ప్రకారం.. సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు రావడవ వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే.. ఎంత పెద్ద సూర్య గ్రహణం అయినా.. 8 నిమిషాలకు మించి ఉండదు. పూర్తి సూర్యగ్రహణం అయినా అంత సేపే ఉంటుంది. ఆ సమయంలో సూర్యుడు మనకు కనిపించడు. ఆసమయంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతాయి. అయితే.. సూర్య గ్రహణ స్పర్శ, మద్య, మోక్ష  సమయంలో చాలామంది నది స్నానం చేసి.. నది తీరాన జపం చేసుకుంటారు. అలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మకం. గ్రహణ స్పర్శ కాలంలో నదీ స్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, స్నానం చేస్తే మంచిది. ఇలా.. సూర్యగ్రహణం రోజు చేసే పనుల వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. అయితే....

Kovil Thiruvaimozhi

ధనుర్మాసం 16-12-2019 నుండి 14-1-2020 వరకు

ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ? ధనుర్మాసంలో ఉదయం , సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు , దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ఆ భూదేవి , అవతారమైన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన , పావై అంటే వ్రతం అని అర్థం. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ , ఆదిత్య పురాణాల్లో , భాగవతంలో , నారాయణ సంహితలో కనిపిస్తాయి. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు.

navagraha pooja saamaan

పసుపు 1 00 గ్రాములు , కుంకుమ 10 0 గ్రాములు , శ్రీ గంధం 1 చిన్న డబ్బా , బియ్యము 4 కిలోలు , గోధుమలు 1250 గ్రాములు , కంది పప్పు 1250 గ్రాములు , పెసర పప్పు 1250 గ్రాములు , పుట్నాల పప్పు 1250 గ్రాములు , తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు , తెల్లని నువ్వులు 1250 గ్రాములు , మినపప్పు 1250 గ్రాములు , ఉలవలు 1250 గ్రాములు , తెల్లని ఆవాలు 100 గ్రాములు , విస్తరి ఆకులు మంచివి 9, దొప్పలు 10,   మామిడి ఆకులు , తమల పాకులు 100 , banana plantains 4 nos. నల్లని పోక వక్కలు 5 0, ఖర్జూరము కాయలు ,50, పసుపు కొమ్ములు 1 5, విడి పూలు కిలో , పూల దండలు 2, తులసి మాల  1, సత్యనారాయణ స్వామి దేవుని ఫోటో , దారము బంతి , ఆవు మూత్రము , ఆవు పేడ,   ఆవు పాలు ½ litre & 100 ml seperately, , పెరుగు ½ kg. , తేనె 200 grams , ఆవు నెయ్యి 100 grams. , , బెల్లము ½ కిలో , కొబ్బరి కాయలు 15 , copper కలశం చెంబులు 3 , దీపం చేమ్మేలు 2, వత్తులు , అగ్గిపెట్టె , నెయ్యి దీపాలు చిన్నవి 2, అయిదు రకముల పండ్లు ఐదేసి చొప్పున, , అరటి పండ్లు 2 డజను , అగర్బతి , కర్పూరము , ముగ్గుపిండి 100 గ్రాములు , కాజు , kissmiss, బాదం పలుకులు , ...

గణపతి హోమం పూజ సామగ్రి వివరాలు

గణపతి హోమం పూజ సామగ్రి వివరాలు . పసుపు 100 గ్రా . కుంకుమ 50 గ్రా . గంధం చూర్ణము చిన్న డబ్బా పచ్చని గారిక ఒక కట్ట , బియ్యం 2 కిలోలు , తమల పాకులు 25, వక్కలు 21, ఖర్జూరం పండ్లు 21, పసుపు కొమ్ములు 21, రాగి చెంబులు 2, దారం బంతి 1, గణపతి ఫోటో , ఆచమనం పాత్ర , 1, పూలు , కిలో , పూల దండ 1, అరటి పండ్లు ఒక డజన్ , గంగా జలం , దూది , అగర్బతి , ముద్ద కర్పూరం ప్యాకెట్ , సమిధలు 10 కట్టలు , హోమం చూర్ణము ప్యాకెట్ , ఆవు నెయ్యి కిలో , పెద్ద హోమం గిన్నె మట్టిది పూర్ణాహుతి ప్యాకెట్ పెద్దది , కుడుములు 108, ఎండు కొబ్బరి కుడుకలు 2, కనుము బట్ట 1, తెల్లని వస్త్రము బంగారు అంచుతో 1, మట్టి గ్లాసులు 5, ఆవు పంచితం ఆవు పేడ , ఆవు పేడ పిడకలు , బ్రాహ్మణ దక్షిణ Rs. 5 , ౦౦౦ /- స్వయం పాకం తో సహా . తయారుగా ఉన్న హోమ గుండం (అద్దెకు దొరుకును ) లేదా ఇటుకలు మరియు సన్నని ఇసుక. బియ్యం పిండి 100 గ్రా.

DHANVANTARI MANTRAM WITH TELUGU LYRICS

పుణ్యః వాచనం పూజ సామగ్రి వివరాలు

[6:25 PM, 11/13/2019] Ramachary Rachakonda: పున్యాహవాచనం పూజ సామగ్రి వివరాలు పసుపు 100 gms, కుంకుమ 100 gms గంధం చిన్న డబ్బా, బియ్యం 3 కిలోలు, తమల పాకులు 25, నల్లని వక్కలు 25, ఖర్జూరం 15, పూలు ½ కిలో,, అరటి పండ్లు, సీతాఫలములు 5, రూపాయి నాణెములు 15, ఆవు మూత్రము, ఆవు పెండ, ఆవు పాలు, ఇత్తడి గిన్నె కొత్తది 1, కొబ్బరికాయలు 3, గ్లాసులు 6, చెంచ 1 ప్లేట్ 1, మంగళ హారతి నెయ్యి దీపాలతో, 2, ఇంటి దేవత ఫోటో రాగి చెంబు 1, చాపలు 3, అగర్బతి 1 ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్ 1, మామిడి కొమ్మ 1, తెల్లని కొత్త వస్త్రము 1, కనుము బట్ట, 1 బ్రహ్మ దక్షిణ 1,500/-

చిలుకు ద్వాదశి 9-11-2019 శనివారం నాడు

అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి , చిలుకు ద్వాదశి , యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి , చిలుకు ద్వాదశి , యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని , ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి   చిలుకు ద్వాదశి   అనీ , యోగులు , మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిధి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన   శ్రీమహావిష్ణువు   కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై , బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని ‘ బృందావని ద్వాదశి ’ గా పిలుస్తారు. ఈ రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన కాశీక్షేత్రంలో కోట...

8-11-2019 శుక్రవారం ఏకాదశి

ఈనాడు  ఏకాదశికే భోధన ఏకాదశి , దేవ-ప్రబోధిని ఏకాదశి , ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి , అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి , విష్ణువును పూజించి , రాత్రి జాగరన చేసి , మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి , పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.   ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మహ్ద్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. "ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు , 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగ ఒక జీవుడు , తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు మనం చిన్న మంచిప...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

Yama Tarpanam vidhi on 27-10-2019 morning

Yama Tharpanam is an important ritual performed on Naraka Chaturdasi day by many Hindu communities in  South India. Yama Tharpanam 2019 date is October 27. The ritual is dedicated to dead ancestors, dead parents and dead relatives.. The Tarpan is performed on the morning of Narak Chaturdashi day. The person who is performing the ritual sits facing south and offers Tarpan to the dead. When the ritual is dedicated to dead parents, the Tarpan is made using Til (Black Sesame seeds).

జమ్మి చెట్టు ప్రాముఖ్యత

జమ్మిచెట్టు విజయానికి సంకేతం. శమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అగ్ని వీర్యమే సువర్ణం అంటారు. అందుకే  జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలందుకుంటోంది. అందుకే యజ్ఞ యాగాదుల వేళ జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు. అలాంటి శమీ వృక్షం దేవీ రూపమని, విజయదశమి రోజు శమీపూజ చేసేవారికి అమ్మలగన్న అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతం చెప్తోంది.    రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసినట్లు రామాయణం ద్వరా తెలుస్తోంది. ద్వాపరయుగంలో అజ్ఞాత వాసానికి వెళ్లేముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే ఉంచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయ దశమినాడు ఉత్తర గోగ్రహణం కోసం అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించి గాండీవాన్ని ధరించి అద్భుత విజయాన్ని అందుకున్నట్లు మహాభారతం చెప్తోందియ. దసరా రోజు శమీ పూజ చేసేవారికి అమ్మవారి కృప లభించటమే గాక శనిదోష నివారణ జరుగుతుందట.    దసరా సాయంత్రం వేళ ఆలయాలు, చెరువుల వద్ద ఉండే జమ్మి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షణలు చేస్తారు. శాస్త్రోక్తంగా జమ్మిని పూజించి జమ్మి ఆకును ప్రసా...

Aigiri Nandini With Lyrics | Mahishasura Mardini | Rajalakshmee Sanjay |...

Maharnavami yanthra puja

యంత్రము  అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతామూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తాయి. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి, పరిపూర్ణమైన పంచొపచార పూజ , ప్రక్రియలు అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. కాకపోతే ఆ యంత్రమునకు మనము నిర్వర్తించే పూజ ప్రక్రియలపై వాటి ఫలితము ఆధారపడి ఉంటుంది. యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. ఔషధ ప్రయోగముకు, రాజ్యపాలనముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామచారము ఇవన్నిటిని తంత్రములు అని పిలుస్తారు.  యంత్రములోని మధ్యభాగములో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుంది అని తంత్ర శాస్త్రములోని నమ్మకము. ఒక్కొ యంత్రము  ఆ యా దేవతామూర్థులకు సంబంధించి నిర్ధిష్టమైన రేఖా చిత్రాల రూపములో చెక్కబడి ఉంటుంది. తంత్ర శాస్త్రములో శక్తికి, శక్తి యొక్క ప్రతిరూపాలకి ఈ యంత్రమును ఉపయోగిస్తారు. ఎంతో శ...