సూర్యగ్రహణం అంటే తెలుసు కదా.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు.. రాహువు లేదా కేతువు స్థానంలో ఉన్నప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుంది.ఈ గ్రహణం మూల నక్షత్రం వాళ్ళు ,ధనుస్సు, మకర, కుంభ రాశుల వారు చూడరాదు. వీరు బంగారు రాహు,కేతు వెండి,చంద్ర బిమ్బములను పూజించి ఆవు నెయ్యితో నిండిన కంచు గిన్నెను , వస్త్రములను ,నువ్వులతో తగిన దక్షిణలు కల్పి దానమీయవలయును. మరియు రావి చెట్టుకు 21 ప్రదక్షిణములు చేయవలయును. సైన్స్ ప్రకారం.. సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు రావడవ వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే.. ఎంత పెద్ద సూర్య గ్రహణం అయినా.. 8 నిమిషాలకు మించి ఉండదు. పూర్తి సూర్యగ్రహణం అయినా అంత సేపే ఉంటుంది. ఆ సమయంలో సూర్యుడు మనకు కనిపించడు. ఆసమయంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతాయి.
అయితే.. సూర్య గ్రహణ స్పర్శ, మద్య, మోక్ష సమయంలో చాలామంది నది స్నానం చేసి.. నది తీరాన జపం చేసుకుంటారు. అలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మకం. గ్రహణ స్పర్శ కాలంలో నదీ స్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, స్నానం చేస్తే మంచిది. ఇలా.. సూర్యగ్రహణం రోజు చేసే పనుల వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి.
అయితే.. అదే సూర్యగ్రహణం రోజున కొన్ని పనులు చేయకూడదట. ఆ పనులు చేస్తే అంతే. జీవితాంతం పేదరికమే వెంటాడుతుందట. సూర్యగ్రహణానికి 12 గంటల ముందును వేదకాలం అంటారు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. ఈ వేదకాలం సమయంలో ఆహారం తీసుకోకూడదు.గ్రహణ సమయమున నిద్రించినచో రోగములు కలుగును. మల,మూత్ర ములు, మైదునము చేసినచో నరకం పొందుతారు.
నిల్వ ఉంచిన వాటిపై ధర్బాలను ఉంచవలయును.
Comments
Post a Comment