నవగ్రహదోషాలు: జన్మించిన సమయాన్ని బట్టి మన జాతకంలో ఆయా గ్రహాలు ఉన్నస్థానాన్ని బట్టి మంచి, చెడు ఫలితాలు వస్తాయి. ఎటువంటి దోషాలకైనా పలు శాస్ర్తాల్లో చెప్పిన సులభోపాయాన్ని చూద్దాం.. గోవు అంటే దేశీయ ఆవు ద్వారా మనకు నవగ్రహదోషాలను తొలిగించుకోవచ్చు. గోవులోని అంగాలలో సమస్త దేవతలు ఉంటారు. సప్తరుషులు,నదలు, తీర్థములు గోవులో ఉంటాయి. గోపాదల్లోనూ ధర్మార్థకామమోక్షములు ఉంటాయి. ఆవుకాళ్లను కడిగి ఆ నీటిని నెత్తిమీద చల్లుకుంటే పాపాలు నశిస్తాయి. అయితే గోవులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి వేళ అంటారు. ఆ సమయంలో ఎవరైతే గోధూళిలో నిలబడతారో వారికి నవగ్రహదోషాలు తొలిగిపోతాయి. భక్తితో, ఇష్టదేవతానామస్మరణతో గోధూళిలో నిలబడాలి. ఇలాకొన్ని రోజులుపాటు చేస్తే తప్పక నవగ్రహదోషాలు పోతాయి. అదేవిధంగా గోవుకు నవధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి తినిపిస్తే శుభాలు కలుగుతాయి. గోపూజకు భక్తి ప్రధానం,మడి ప్రధానం కాదు. సూక్ష్మంలో మోక్షం పొందాలంటే గోపూజ,గోదానం, గోసేవ చేసుకోండి తప్పక విశేష ఫలితాలు లభిస్తాయి. గోవుకు సంబంధించిన పలు విషయాలను అనుశాసన పర్వంలో వ్యాసుడు పలు విషయాలను వివరించారు. గోధూళివేళ స్వదేశీ గోవులు ఉన్నచోట నిలబడం...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com