// జై శ్రీ రాం //
1-6-2019 శనివారం నాడు శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు.
దీనికి నిష్టా నియమం కావాలి.
👉ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి ఒళ్ళంతా మర్ధన చేసుకుని నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి.
👉ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
👉 ఈ రోజు మద్య,మాంసాలు ముట్టరాదు.
👉 వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
👉 వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.
👉అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. ఎవరితోను వాదనలకు దిగరాదు.
👉 ఈ రోజు ఆకలితో ఉన్న వారికి, పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.
మూగ జీవులకు ఆహార గ్రాసలను, నీటిని ఏర్పాటు చేయాలి.
కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.
👉అనాధలకు, అవిటి వారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.
👉తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.
👉అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని, మన మేలు కోరేవారిని, ఉద్యోగం ఇప్పించిన వారిని, ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.
ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను, భవ బంధాలను మరువరాదు.
ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.
Comments
Post a Comment