జై శ్రీమన్నారాయణ. చారిత్రిక ఐతిహ్యం శ్రీ గోదాదేవి శ్రీ విష్ణుచిత్తుల (పెరియాళ్వార్) వారికి నేటి తమిళనాడులోని శ్రీ విల్లి పుత్తూరులో పుబ్బ నక్షత్రం నాడు తులసి వనం లో లభించింది. రోజూ స్వామికి పూలదండలు కట్టి సమర్పించే తనకు ఆయన అనుగ్రహంగా దొరికిన ఆ బాలికకు "కొదై " (పూలదండ) అని పేరు పెట్టారు. ఆమెకే "గోదా"అని పేరు వచ్చినది. శ్రీ విష్ణుచిత్తుల ఇంట అల్లారుముద్దుగా పెరిగిన గోదా తండ్రి తో బాటే మాలలు కట్టి, ముందుగా తాను ధరించి తర్వాత స్వామి అర్పించేందుకు ఇచ్చేది. ఇది తప్పని తండ్రి వారించినా సాక్షాత్తూ రంగనాథుడే ఆమె ధరించిన మాలలే తనకు ఇష్టమని స్వప్నంలో కనిపించి చెబుతాడు. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది. విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇది కానిపని అనుకుంటాడు. అయితే ఇదే సమయంలో గోదాదేవి భక్తి ఫలించి, అక్కడి పెద్దలకు రంగనాథుడు స్వప్నంలో కనిపించి గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని ఆజ్ఞాపించాడు. పెళ్లికూతురుగా వచ్చిన గోదా గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అ...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com